జాతీయ వార్తలు

ఊరి తరహా దాడి విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 5: ఊరి తరహాలో మరోసారి భారత్‌పై దాడి చేసేందుకు మిలిటెంట్లు పన్నిన కుట్ర భగ్నమైంది. బందిపురా జిల్లా సుంబల్‌లోని ఓ సైనిక శిబిరంపై దాడి చేసేందుకు సోమవారం ప్రయత్నించిన నలుగురు మిలిటెంట్లను సిఆర్‌పిఎఫ్, కాశ్మీర్ పోలీసులు మట్టుబెట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో భారీ ఆయుధాలతో ఈ మిలిటెంట్లు సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌లోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించారు. మొదట గ్రెనేడ్లు విసిరి అనంతరం కాల్పులకు దిగారు. ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు, జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. దాదాపు ముప్పావు గంటపాటు జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు హతులయ్యారని సైనిక వర్గాలు తెలిపాయి. ఎదురుకాల్పులు మొదలైన కొన్ని నిముషాల్లోనే మొదటి టెర్రరిస్టును దళాలు వధించాయి. పారిపోయేందుకు ప్రయత్నించిన మరో మిలిటెంట్‌ను కూడా వెంబడించి మట్టు బెట్టాయి. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో భారీ పరిమాణంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నాలుగు ఎకె 47రైఫిళ్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ నలుగురు మిలింటెంట్లు ఇటీవలే రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటారని, ఊరి తరహాలో భారత సైనిక శిబిరంపై దాడి చేయాలన్నదే వీరి కుట్రగా అధికార వర్గాలు తెలిపాయి. వీరి వద్ద మూడు పెట్రో బాంబులు కూడా ఉన్నట్టు గుర్తించినట్టు వెల్లడించాయి. ఈ సైనిక క్యాంప్‌ను స్వాధీనం చేసుకుని దాన్ని దగ్ధం చేయాలన్నదే ఈ నలుగురు మిలిటెంట్ల ఉద్దేశంగా కనిపిస్తోందని ఉన్నతాధికారులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమై మిలిటెంట్లను మట్టుబెట్టినందుకు సిఆర్‌పిఎఫ్ ఐజి జుల్ఫికర్ హసన్ జవాన్లు, పోలీసులను అభినందించారు.

మిలిటెంట్లను తుదముట్టించిన అనంతరం విజయ సంకేతాన్ని చూపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్న భారత జవాన్లు