జాతీయ వార్తలు

24మంది బుగ్గి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరేలీ (యూపీ), జూన్ 5: ఉత్తర ప్రదేశ్‌లోని 24 నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24మంది సజీవ దహనమయ్యారు. మొత్తం 41మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి యూపీలోని గోండా వస్తున్న ప్రభుత్వ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని పూర్తిగా దగ్ధం కావడంతో ఈ ఘోరం జరిగింది. మరో 14మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించింది ఆడో మగో తెలియనంతగా ప్రయాణికుల మృత దేహాలు కాలిపోయాయి. మృతుల్ని గుర్తించేందుకు డిఎన్‌ఎ పరీక్షలు జరుపుతామని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముగ్గురు ప్రయాణికులు స్వల్పగాయాలతోనే బయట పడ్డారని ఉత్తర ప్రదేశ్ మంత్రి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ఆదేశం మేరకు లక్నో నుంచి హెలికాప్టర్‌లో ప్రమాద స్థలానికి చేరుకున్న అగర్వాల్ సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. ట్రక్కు డ్రైవర్ సకీబ్‌ను అరెస్టు చేశామని, వాహనాన్ని జప్తు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాతే ప్రయాణికుల్ని గుర్తించే అవకాశం ఉందని బరేలీ ప్రధాన వైద్య అధికారి విజయ్ యాదవ్ తెలిపారు. ఎదురుగా వస్తున్న లారీని వేగంగా గుద్దుకోవడండో యుపిఎస్‌ఆర్‌టిసి బస్సు డీజిల్ ట్యాంకు పేలిపోవడం వల్లే మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పరస్పరం వేగంగా ఢీకొనడం వల్ల బస్సుతో పాటు లారీలో కూడా మంటలు చెలరేగాయని,సకాలంలోనే అగ్ని మాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ మంటలు దట్టంగా వ్యాపించడం వల్ల వాటిని అదుపు చేయడం కష్టసాధ్యమైందని పోలీసులు తెలిపారు.
బాధిత కుటుంబాలకు 4లక్షల సహాయం
యూపీ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50వేల చొప్పున సహాయాన్ని ప్రకటించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ మరో మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 50వేలు, స్వల్పంగా గాయపడిన వారికి 25వేల రూపాయలు పరిహారంగా అందిస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా పోస్టుమార్టం జరిపి మృతుల్ని గుర్తించిన తర్వాతే నష్ట పరిహారం మొత్తాన్ని వారి కుటుంబీకులకు చెల్లిస్తామని బరేలీకి చెందిన మంత్రి అగర్వాల్ తెలిపారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఈ బస్సులో చంద్రశేఖర్ శుక్లా, సుందర్‌లాల్ యాదవ్ ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని, ఢిల్లీ నుంచి రామ్‌పూర్ వరకూ శుక్లా నడిపాడని, రామ్‌పూర్ నుంచి యాదవ్ డ్రైవింగ్ చేశాడని కండక్టర్ అఖ్తర్ అజీజ్ పోలీసులకు తెలిపాడు.

బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో తగలబడుతున్న వాహనాలు