క్రీడాభూమి

జొకోవిచ్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 7: డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్క్రమించాడు. టైటిల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన అతనిని ఆరో సీడ్ డామినిక్ థియెమ్ 7-6, 6-3, 6-0 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా, మంగళవారం నాటి మ్యాచ్ బుధవారం కొనసాగింది. మొదటి సెట్‌ను అతి కష్టం మీద గెల్చుకున్న థియెమ్ తర్వాతి రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచాడు. ఎవరూ ఊహించని విధంగా జొకోవిచ్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఫైనల్‌లో స్థానం కోసం అతను తొమ్మిది పర్యాయాలు టైటిల్ సాధించి రికార్డు సృష్టించిన ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్‌లో పాబ్లో కారెనో బస్టాపై నాదల్ గెలిచాడు. మొదటి సెట్‌ను 6-2 తేడాతో సొంతం చేసుకున్న అతను రెండో సెట్‌లో 2-0 తేడాతో ముందంజలో నిలిచాడు. ఈ దశలో కండరాల నొప్పితో బస్టా వైదొలగడంతో నాదల్‌కు సెమీస్‌లో చోటు దక్కింది.
కాగా, మహిళల సింగిల్స్‌లో సిమోనా హాలెప్ సెమీ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె 3-6, 7-6, 6-0 తేడాతో ఎలినా స్విటొలినియాను ఓడించింది.
ఫైనల్‌లో బొపన్న జోడీ
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో గాబ్రియేల డబ్రోవ్‌స్కీతో కలిసి ఆడుతున్న భారత సీనియర్ ఆటగాడు రోహన్ బొపన్న ఫైనల్ చేరాడు. వీరు సుమీ ఫైనల్‌లో ఆండ్రె హ్లావస్కోవా, ఎడ్యురార్డ్ రోజర్ వెసెలిన్ జోడీపై 7-5, 6-3 తేడాతో గెలిచారు.

డామినిక్ థియెమ్