జాతీయ వార్తలు

కర్ణన్‌కు దక్కని ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: కోల్‌కతా హైకోర్టు వివాదాస్పద న్యాయమూర్తి సిఎస్ కర్ణన్‌కు సుప్రీం కోర్టులో ఉపశమనం లభించలేదు. తన అరెస్టు వారెంట్‌పై స్టే ఇవ్వాలన్న కర్ణన్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొంటున్న న్యాయమూర్తికి ఆరునెలల జైలుశిక్ష విధిస్తు సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిం ది. అయితే కర్ణన్ అరెస్టును తప్పించుకుం టూ వస్తున్నారు. కర్ణన్‌ను కస్టడీలోకి తీసుకోవద్దని పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆదేశించాలంటూ ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, దీపక్ గుప్తాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ విషయంలో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని బెంచ్ స్పష్టం చేసింది. ‘నేను స్టే మాత్రమే అడుగుతున్నా. కేసుకు సంబంధించి మిగతావి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిశీలిస్తారు’ అని కర్ణన్ తరఫు న్యాయవాది మాథ్యూ జె నెండుంపర అన్నారు. కనీసం స్టే ఇవ్వాలని పదే పదే ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు పట్టించుకోలేదు. ‘మీరు వెళ్లి ప్రత్యేక బెంచ్‌ను ఆశ్రయించండి. మేం స్టే ఇవ్వలేం’ అని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ‘మరో రెండు మూడు వారాలు వేచి ఉం డండి. మేం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ప్రత్యేక బెంచ్ ఆదేశాల మేరకే ఉంటుంది’ అని బెంచ్ పేర్కొంది.