సాహితి

అమ్మమ్మ వడ్డాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూడటానికి చువ్వలా ఉన్నా
పది మందిలో ప్రత్యేకంగా కనిపించేది అమ్మమ్మ
కారణం ఆమె నడుముకున్న వడ్డాణమే
శివుని మెడలో నాగరాజులా
ఎపుడూ ఆమె నడుమును అంటిపెట్టుకునే ఉండేది
అమ్మమ్మ పెళ్ళిలో పుట్టింటి వారు పెట్టిన
ఇరవై తులాల వడ్డాణం
ఆమె తనువులో ఓ భాగమైపోయింది
తాతయ్యనైనా విడిచి ఉండేది కాని
వడ్డాణాన్ని మాత్రం వదిలేది కాదు స్నానమాడే వేళ తప్ప
కాలక్రమంలో అమ్మమ్మ ఇంటి పేరు మరుగునపడి
‘వడ్డాణం శేషమ్మ’గా మారిపోయింది
చిన్నపుడు ఆప్యాయంగా ననె్నత్తుకుంటే
బాబోయ్ పాము, పాము అంటూ
చంక దిగిపోయే వాణ్ణట
అమ్మ చెపితే ఆశ్చర్యం.
ఒరే మనవడా నీకు కూతురు పుడితే నా పేరు పెట్టరా
నా వడ్డాణం మీ అమ్మాయికే ఇస్తాననేది
అమ్మమ్మ మాట ప్రకారమే పిన్నమ్మలు
నా కూతురు ‘శేషారత్నా’నికే ఇచ్చారు ఆ వడ్డాణం
అమ్మమ్మ ఇపుడు లేకున్నా ఆభరణం అరిగి తరిగినా
ఆమె జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయ్
వడ్డాణం పెట్టుకుని వయ్యారంగా నడయాడే
నా కూతురు రూపంలో

- హైమవతీ సత్య