కర్నూల్

బిజెపి పాలనలో 103 ప్రజాసంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జూన్ 11:బిజెపి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు సంవత్సరాల పాలనలో 103 ప్రజా సంక్షేమ పాలనలోప్రవేశ పెట్టిన ఘనత తమ పార్టీకే దక్కిందని కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షులు హరిష్‌బాబు విలేఖర్ల సమావేశంలో స్పష్టం చేశారు. బిజెపి కార్యాలయం లో ఆదివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో హరిష్‌బాబు మాట్లాడుతూ మోదీ హయాంలో ప్రారంభించిన పథకాలను గురించి ప్రజలకు వివరించటానికి దేశ వ్యాప్తంగా 395 ప్రాంతాలలో మోదీ పెస్ట్, 525 సెంటర్‌లో సబ్‌కాసాత్, సబ్‌కావికాస్ అనే కార్యక్రమాలను చేపట్టి సభల ద్వారా ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ప్రకాష్‌నడ్డా ఈనెల 12న ఆదోనిలో జరిగే సబ్‌కాసాత్, సబ్‌కావికాస్ సభలో పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్ అధికారులు ప్రాజెక్టు అధికారి వేణు, హెచ్‌ఆర్, అధికారి మగ్బల్ నిర్వహిస్తారని అన్నారు. జాతీయ కిసాన్‌మోర్చ అధికార ప్రతినిధి చల్లపల్లి నరసింహారెడ్డి ఆధ్వర్యం లో స్థానిక శ్రీనివాసథియేటర్‌లో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున పాల్గోనాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 65 సంవత్సరాలలో ఏ ప్రభు త్వం చేయని విధంగా ప్రజల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.2లక్షల కోట్లను కేటాయించిందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును జాతీ య ప్రాజెక్టుగా ప్రకటించి నాబార్డు ద్వారా నిధులు గురించి కేంద్రం ఈప్రాజెక్టును తన నిధులతోనే పూర్తి చేస్తుందని అన్నారు. ప్రధాని శిరాక్షయోగజన, జీవన జ్యోతి యోజన పథకం పేదలక వరమని మాములుగా మృతి చెందిన రూ. 2లక్షలు బాధిత కుటుంబాలకు అందజేస్తామన్నారు. దేశంలో 24వేల గ్రామాలలో విద్యుత్ సౌకర్యం లేదని ఆగ్రామాలకు 2019లోపు విద్యుతీకరణ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. ధన్‌జన్ యోజన పథకం కింద దేశంలో బ్యాంకుల్లో అకౌంట్లు లేని పేదలకు 28వేల కోట్ల అకౌంట్లను బ్యాంకుల్లో ప్రారంభించారని అన్నారు. ప్రధాని మోదీ పిలుపునందుకున్న దేశంలో ఉన్న సంపన్నులు 1.4 కోట్ల మంది గ్యాస్ సబ్సీడిని వదులుకున్నారన్నారు. పేదలకు 2వేల కోట్లు గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం జరిగిందని చెప్పారు. రోడ్లు మీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు ముద్ర యోజన బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం ఇప్పిస్తుందని అన్నారు. గాంధీ కలలు గన్న స్వచ్చ్భారత్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మాణానికి రూ.12వేలను ఇచ్చిందని అన్నారు. దేశంలో ఎక్కడ బహిర్భూమి లేకుండా చేయడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రధాని కౌశల్య యోజన పథకం కింద నిరుద్యోగ యువకులు నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రతి యువకుడికి రూ.32వేల ఖర్చుతో శిక్షణ కార్యక్రమాలను కూడా ఇచ్చే ఏర్పాటు చేసిందని అన్నారు. ఈవిధంగా దేశ ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికే సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కర్నూలులో ప్రధాని పేస్ట్ కార్యక్రమం ఆదోనిలో సబ్‌కాసాత్, సబ్‌కావికాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం కేంద్ర మంత్రి జేపినడ్డా పాల్గొనే సబ్‌కాసాత్, సబ్‌కావికాస్ సభకు ప్రజలంతా పాల్గొనాలని ఆయన కోరారు.