జాతీయ వార్తలు

‘స్టింగ్’లో దొరికిన పన్నీర్ వర్గం ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 13: తమిళనాడులో అధికార అన్నాడిఎంకె వర్గాల వ్యవహారం అనూహ్య మలుపుతిరిగింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సారధ్యంలోని అన్నాడిఎంకె వర్గానికి చెందిన ఓ శాసన సభ్యుడు ఎమ్మెల్యేల కొనుగోలు ఉచ్చుకో చిక్కుకున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన పన్నీర్ సెల్వం విశ్వాస పరీక్షకు ముందు ఎస్‌ఎస్ శరవణన్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ టీవీ చానల్‌లో ఇందుకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ శరవణన్‌ను మాజీ సిఎం పన్నీర్ సెల్వం ఆదేశించారు. ఫిబ్రవరి 14నాటి విశ్వాస పరీక్షలో కె పళనిస్వామి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని వీడియోలో వినిపించిన గొంతు తనది కాదని శరవణన్ ఖండించారు. ఈ ఆరోపణలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ స్టాలిన్ సారధ్యంలోని డిఎంకె హైకోర్టులో పిటిషన్ వేసింది. బుధవారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్న తరుణంలో వెలుగుచూసిన ఈ స్టింగ్ ఆపరేషన్ రాజకీయ కలకలం సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి.