జాతీయ వార్తలు

ఇక ఫిబ్రవరిలోనే సిబిఎస్‌సి పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) నిర్వహించే టెన్త్, 12వ తరగతి పరీక్షలు ఇకనుంచి ఫిబ్రవరిలోనే ఉంటాయి. ప్రతి సంవత్సరం మార్చిలో ఈ పరీక్షలు నిర్వహించేవారు. దానికి బదులుగా ఫిబ్రవరిలో 10, 12వ తరగతి పరీక్షలు జరపాలని నిర్ణయించినట్టు బోర్డు బుధవారం ఇక్కడ స్పష్టం చేసింది.
2018 ఫిబ్రవరి రెండోవారం తరువాత పరీక్షలు ప్రారంభించి నెలలోపే పూర్తిచేస్తారు. సిబిఎస్‌ఇ చైర్మన్ ఆర్‌కె చతుర్వేది ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించడంవల్ల ఎంతో వెసులుబాటు ఉంటుందన్నారు. ఏప్రిల్‌లో ఉపాధ్యాయులకు సెలవులు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని, మార్చి నెలకు ముందే అంటే ఫిబ్రవరిలో పరీక్షలు పెడితే ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించవచ్చని అన్నారు.
మూల్యాంకనంపై 12వ తరగతి విద్యార్థులు కొందరు ఫిర్యాదు చేసినందున సిబిఎస్‌ఇ రెండు విచారణ కమిటీలను ఏర్పాటు చేసింది. లోపాలపై కమిటీ నివేదికలు అందాక చర్యలు తీసుకుంటామని చతుర్వేది వెల్లడించారు.