జాతీయ వార్తలు

అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన ఇవదించాలన్న కేంద్ర మంఅతివర్గం సిఫార్సుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఆమోదముద్ర వేయడంతో ఆ రాష్ట్రం రాష్టప్రతి పాలన కిందికి వచ్చింది. రాజకీయ అనిశ్చితి నెలకొన్న కారణంగా అరుణాచల్ ప్రదేశలో రాష్టప్రతి పాలన విధించాలని గత ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్రమంత్రివర్గం నిర్ణయించిన రెండు రోజుల తర్వాత రాష్టప్రతి దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులపై సంతకాలు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఒక సమావేవానికి, మరో సమావేశానికి మధ్య ఆరునెలలకు మించి వ్యవధి ఉండకూడదని, అయితే రాష్ట్రంలో ఈ గడువుమించి పోయినందున రాజ్యాంగ సంక్షోభం తలెత్తిన కారణంగా రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పడం తెలిసిందే.

పార్లమెంటులో రభసే

రోహిత్ మృతిపై కత్తులు నూరుస్తున్న విపక్షాలు
ఇద్దరు మంత్రుల బర్తరఫ్‌కు పట్టు?
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, జనవరి 26: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధనా విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య వ్యవహారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కుదిపివేయబోతోంది. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన కేంద్ర మంత్రులపై చర్య తీసుకోనంత వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను స్తంభింపజేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. దళిత స్కాలర్ ఆత్మహత్య సంఘటనను బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌తోపాటు వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు రోహిత్ ఆత్మహత్యపై బడ్జెట్ సమావేశాలను స్తంభింపజేసేందుకు సిద్ధమవుతున్నాయి. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నది ప్రతిపక్షాల డిమాండ్. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం మాత్రం ఇద్దరు మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించేందుకు ససేమిరా అంగీకరించటం లేదు. ఇద్దరు సీనియర్ అధికారులతో కూడిన మానవ వనరులశాఖ నిజనిర్ధారణ కమిటీ సిఫారసుల మేరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ అప్పారావును సెలవులపై పంపించటం తెలిసిందే.
వైస్ చాన్సలర్‌తోపాటు కొందరు సీనియర్ అధికారుల అనాలోచనా వ్యవహారం మూలంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని తమ నివేదికలో పేర్కొనట్లు తెలిసింది. వైస్ చాన్సలర్, ఇతర సీనియర్ సిబ్బందికి దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల మధ్య ఉండవలసినంత సాన్నిహిత్యం లేదనీ, దీని కారణంగా వారి మధ్య దూరం పెరిగిపోయిందని ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసిందే. దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు వివక్ష మూలంగా మానసిక వేదనకు గురవుతుంటే వారిని పట్టించుకునే నాథుడు లేకుండాపోయాడు, ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకునే వ్యవస్థ విశ్వవిద్యాలయంలో లేదని వారు నివేదించినట్టు తెలిసింది.
ప్రొఫెసర్లు కొందరు విద్యార్థుల పట్ల సానుకూలత చూపించటం మరికొందరి పట్ల వివక్షతతో వ్యవహరించినట్లు తమ దృష్టికి వచ్చిందని కమిటీ తమ నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. నిజనిర్దారణ కమిటీ నివేదిక ప్రకారం రోహిత్ ఆత్మహత్యకు విశ్వవిద్యాలయం పని తీరులో లోపం ఉన్నట్లు తెలిసినందున ఇద్దరు మంత్రులపై చర్య తీసుకోవలసిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. మంత్రులు పాత్ర ఎంత మాత్రం ఉన్నట్టు ఎక్కడా కమిటీ అభిప్రాయపడలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు మాత్రం ఎన్‌డిఏ ప్రభుత్వం వాదనతో ఏకీభవించటం లేదు. రోహిత్ ఆత్మహత్యకు ఇద్దరు మంత్రులు వ్యవహరించిన తీరే కారణమని ఆరోపిస్తున్నారు. విసిని సెలవులపై పంపించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని అంటున్నారు. ఇద్దరు మంత్రులపై చర్య తీసుకొకపోతే బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగటం కష్టమని ప్రతిపక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు.