ఖమ్మం

నేడు సింగరేణి సమ్మెపై చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 22: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల అమలు కోసం నిర్వహిస్తున్న సమ్మెపై చర్చించేందుకు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్యాంసుందర్ సింగరేణి యాజమాన్యాన్ని, జాతీయ కార్మిక సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించారు. శుక్రవారం హైద్రాబాద్‌లో డిప్యూటీ సిఎల్‌సి కార్యాలయంలో చర్చలు జరుగనున్నాయి. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15వ తేదీ నుంచి సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాలు, 11 ఏరియాల్లో నిర్వహిస్తున్న సమ్మెపై చర్చించేందుకు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ చర్యలు చేపట్టారు. జాతీయ కార్మిక సంఘాలైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి), సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్‌టియుసి), సింరగేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు), భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్), హెచ్‌ఎంస్ సంఘాలకు చెందిన ఇద్దరు ప్రతినిధులు చర్చలకు హాజరుకానున్నారు. సింగరేణి యాజమాన్యం నుంచి పలువురు డైరెక్టర్లు హాజరుకానున్నారు. వారసత్వ ఉద్యోగాల అమలు కోసం జరుగుతున్న సమ్మెను విరమింప చేసే విధంగా చర్యలు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత ఎనిమిది రోజులుగా నిర్వహిస్తున్న సమ్మె వల్ల కార్మికులు విధులకు అంతరాయం ఏర్పడుతుంది. యాజమాన్యం పట్టుదలతో అధిక ఉత్పత్తి సాధనకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యం జరుగనున్న కీలక చర్చల్లో సమ్మె విరమించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.