ఖమ్మం

మార్కెట్ తరలింపుపై అందరి అభిప్రాయం తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జూన్ 22: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తరలింపులో త్రీటౌన్‌లోని అందరి అభిప్రాయాన్ని సేకరించిన తరువాత మిర్చి మార్కెట్‌ను తరలించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొప్పు నరేష్ డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెట్‌ను గుర్రాలపాడు ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ నుండి వర్తక సంఘం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ఎదుట రిలే నిరహర దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దిగుమతిశాఖ, వర్తక సంఘం నాయకులు మాట్లాడుతూ వ్యాపారులకు, త్రీటౌన్ ప్రాంత ప్రజలకు అనుకులమైన గుర్రాలపాడు ప్రాంతానికి మిర్చి మార్కెట్‌ను తరలించాలని, ప్రజలు ఎక్కడ కోరుకుంటే అక్కడికే తరలించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. రైతులకు, వ్యాపారస్థులకు దూర ప్రాంతమైన రాఘనాధపాలెంలో మిర్చి మార్కెట్ తరలింపు వల్ల అనేక మంది ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. 60సంవత్సరాలుగా మిర్చి మార్కెట్‌పై లక్షల మంది బతుకుతున్నారని వారికి అనువుగా ఉండే ప్రాంతానికి తరలించకుండా కొంత మంది వారి భూములకు అనుగుణంగా మార్కెట్ తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రఘనాధపాలెంలో కేవలం 62ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని, గుర్రాలపాడు ప్రాంతంలో ప్రభుత్వ భూమి 70ఎకరాలకు పైగా ఉన్న గుర్రాలపాడు ప్రాంతం అందరికి అనువైందన్నారు. ఐదు మండలాలను కలుపుతున్న గుర్రాలపాడు ప్రాంతంలో మిర్చి మార్కెట్ తరలించటం వల్ల రైతులకు, వ్యాపారస్థులకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. మార్కెట్‌ను గుర్రాలపాడుకు తరలించకపోతే తమ వ్యాపారస్థుల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. వర్తక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరహర దీక్షకు ఈ కార్యక్రమంలో వర్తక సంఘం నాయకులు వడ్డే నర్సింహరావు, పగడాల మోహన్‌రావు, పాపారావు, యుగేందర్, ఆదినారాయణ, ఉప్పలరావు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్‌పై రాజకీయం చేస్తున్న టిఆర్‌ఎస్ : తమ్మినేని
వ్యవసాయ మార్కెట్ తరలింపులో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాజకీయ చేస్తున్నారని మార్కెట్‌పై 60సంవత్సరాలుగా అధారపడి జీవిస్తున్న త్రీటౌన్ ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. ఇప్పటికైన మిర్చి మార్కెట్‌ను వ్యాపారస్థులకు, రైతులకు అందరికి అందుబాటులో ఉండేలా గుర్రాలపాడు ప్రాంతానికి తరిలించాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌తో పాటు పలువురు నాయకులు మద్దతు తెలిపారు.