ఖమ్మం

ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 23: భద్రాచలం చుట్టూ ఉన్న ఐదుగ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని కోరుతూ సిపిఐ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావుప్రధాన మంత్రి మోదీతో బాటు కేంద్ర మంత్రులు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శుక్రవారం లేఖలు రాసారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లాలోని భద్రాచలం చుట్టు ప్రక్కల ఉన్న ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయగూడెం, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామ పంచాయతీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీలీనం చేశారని లేఖలో పేర్కొన్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు భద్రాచలం రావాలంటే ఈ పంచాయతీల మీదుగా వెళ్ళాల్సి ఉందన్నారు. ఈ గ్రామాలు ఆంధ్రలో విలీనం చేయడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఆయోధ్యగా పేరుగాంచిన సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములు ఇప్పుడు ఆంధ్రలో కలసిన గ్రామపంచాయతీలలో ఉన్నాయని స్పష్టం చేశారు. దేవాలయం తెలంగాణ, ఆలయ భూములు ఆంధ్రాలో ఉండటం వలన భవిష్యత్‌లో ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతాయన్నారు. ఈ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసేందుకు బిజెపి, టిడిపి, టిఆర్‌ఎస్ పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆలేఖలో పేర్కొన్నారు. దేవాలయ భూములు ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ నెలలో జరగబోయో పార్లమెంట్ సమావేశాల్లో గ్రామాల విలీన బిల్లును అమోదింపచేయాలని లేఖలో కోరారు.