ఖమ్మం

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (జమ్మిబండ), జూన్ 23: అనుమతిలేని విత్తనాలతో పాటు రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే నకిలీ విత్తన వ్యాపారాలను అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్పెషల్‌బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్‌లో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కొంతమంది వ్యాపారులు అక్రమార్జనే ధ్యేయంగా అడ్డదారిలో రేషన్‌బియ్యం, ఇసుక, గుట్కాలను మళ్ళిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అలసత్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడాల్సిన అవసరం లేదని, ఎక్కడైన అసాంఘీక కార్యక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సమర్థవంతంగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా అనుమతి లేకుండా రైతులను ప్రలోబాలకు గురిచేస్తూ విత్తనాలు, ఎరువుల గురించి వాహనాల్లో ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకోవడంతో పాటు ఆ వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏసిపిలు సురేష్‌కుమార్, గణేష్, రాజేష్, శ్రీ్ధర్‌రెడ్డి, సిఐలు సారంగపాణి, విజయ్‌కుమార్, రెహ్మాన్, నరేష్‌రెడ్డి, వెంకన్నబాబు, అంజలి, తిరుపతిరెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.