ఖమ్మం

అన్నీ అవకతవకలే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, జూన్ 23: నిర్దిష్ట నియమ నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు తీరు అస్తవ్యస్తంగా తయారైంది. ఉపాధి పథకం నిధులతో మండలంలో గత ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ వరకు రూ.2.99 కోట్లతో జరిగిన పనులపై 11వ విడత సామాజిక తనఖీ నిర్వహించిన అనంతరం శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్‌డివో అడిషనల్ ప్రాజెక్టు అధికారి విజయ చంద్ర, జిల్లా విజిలెన్స్ అధికారి చిన్న వెంకటేశ్వరరావు, ఎపిడి కరుణాకర్ రెడ్డిల సమక్షంలో ప్రజావేదికలో సామాజిక తనిఖీ డిఆర్పీలు నివేదికలను చదివి వినిపించారు. క్షేత్ర స్థాయిలో పథకం నిబంధనలను అమలు చేయటంతోపాటు కూలీలకు ఉపాధి కల్పించాల్సిన ఉపాధి ఉద్యోగులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించటంతో పథకం అమలులో డొల్లతనం వెల్లడైంది. ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ తన పరిధిలో ఏడు రికార్డులను నిర్వహించాల్సి ఉన్నా మండలంలో ఎక్కడా సక్రమంగా నిర్వహించలేదనే విషయాన్ని సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది. ఉపాధి నిధులతో మండలంలోని పలు గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించటంతోపాటు, భూమి అభివృద్ది పనులు, ఫార్మేషన్ రోడ్లు, సోషల్ ఫారెస్ట్ అభివృద్ది వంటి పనులు చేపట్టారు. జాబ్ కార్డులను నూరు శాతం ఎక్కడా అప్ గ్రేడ్ చేయనట్లు తనిఖీలో తేలింది. పని ప్రదేశాల్లో మూడు దశల్లో తీసిన ఫోటోలను పనులకు సంబంధించిన కొలతల పుస్తకాలు (ఎంబి)లకు జత చేయాల్సి ఉన్నా అధికశాతం మంది ఫీల్ట్ అసిస్టెంట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్‌లు నమోదు చేయలేదు. ఇంతే కాకుండా పనులకు సంబంధించిన కొలతలను మెజర్‌మెంట్ బుక్‌లో నమోదు చేయటంలో కూడా అవకతవకలు జరిగినట్లు తనిఖీలో తేలింది. క్షేత్ర స్థాయిలో ఉపాధి సిబ్బంది నిబంధనలను సక్రమంగా పాటించకపోవటంతోపాటు కంప్యూటరీకరణ విషయంలో తప్పులు దొర్లటంతో మాచినేపేటతండా, కాకర్ల, అనంతారం, బేతాళపాడు పలు గ్రామాల్లో కూలీలకు వేతన చెల్లింపులు ఇబ్బందికరంగా మారినట్లు తనిఖీ బృందం వ్యక్తం చేసింది. బేతాళపాడు ఫీల్డ్ అసిస్టెంట్‌పై గ్రామస్థులు కొందరు రాత పూర్వకంగా ఎపిడికి ఫిర్యాదు చేశారు. ఇంతే కాకుండా గ్రామంలో నాలుగేళ్ల నుంచి ఇప్పటి వరకు కూలీలకు సంబంధించిన వేతనాలు సుమారు రూ.4లక్షల మేర పెండింగ్‌లో ఉన్నట్లు పలువురు ప్రజావేదికలో వాపోయారు. సామాజిక తనిఖీలో వచ్చిన అవకతవకల గురించి ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ఎపిడి విజయ చందర్ మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు నిర్వహించిన సామాజిక తనిఖీల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి రూ.1.47 లక్షలు రికవరీ చేయాల్సి ఉండగా, రూ.1.32లక్షలు వసూలు చేయటం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనులు జరిగే విధంగా బాధ్యతగా పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మూడు చిట్టిబాబు, ఎంపిడివో భారతి, పలుశాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.