అనంతపురం

ఆధార్‌తో మరింత పారదర్శకంగా భక్తులకు సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 23: శ్రీవారి దర్శనం, బస, లడ్డూ ప్రసాదం తదితర సేవల్లో మరింత పారదర్శకత పెంచేందుకు, భద్రతాపరమైన ఇబ్బందులు రాకుండా చూసేందుకు భక్తులు ఆధార్‌ను వినియోగించి టిటిడి యాజమాన్యానికి సహకరించాలని టిటిడి తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో జూలై 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని జత చేయాలని, బ్రేక్ దర్శన సమయంలో భక్తులు ఆధార్‌ను వెంట తీసుకురావాలని కోరారు. తిరుమలలోని జె ఇ ఓ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జె ఇ ఓ మాట్లాడుతూ ఇ ఓ సూచనల మేరకు ఇటీవల శ్రీవారి ఆలయంలోని వెండివాకిలి వద్ద చేపట్టిన స్వల్పమార్పుల సత్ఫలితాలను ఇస్తున్నాయని, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో అదనంగా మరుగుదొడ్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలను పెంచుతున్నట్లు వివరించారు. వేసవి రద్దీ సమయంలో అధికారులు సమన్వయం చేసుకొని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారని, ఇదే స్ఫూర్తితో రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గత బ్రహ్మోత్సవాల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడుతామన్నారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లో మరింతగా ఆధ్యాత్మిక భావన పెంచేందుకు లైటింగ్, పచ్చదనం పెంచుతామన్నారు.
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో లక్కీడిప్
లక్కీడిప్‌లో ఉంచిన 10,710 శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లకు గాను 96,837 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నారని జె ఇ ఓ తెలిపారు. శుక్రవారం ఆన్‌లైన్‌లో లక్కీడిప్ తీశామని, టిక్కెట్లు పొందిన భక్తులందరికీ ఎస్ ఎం ఎస్, ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేశామని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో డిప్‌లో టిక్కెట్లు ఖరారు అయిన భక్తులు ఈనెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు టిటిడి వెబ్‌సైట్ పేమెంట్ గేట్ వే నగదు చెల్లించవచ్చన్నారు.
స్కానింగ్ కేంద్రం పరిశీలన
టిటిడి ఇ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ సూచనల మేరకు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న స్కానింగ్ కేంద్రాన్ని వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో ఏర్పాటుచేసే ప్రతిపాదనలపై టిటిడి సివిఎస్‌ఓ శ్రీనివాస్‌తో కలిసి జెఇఓ శ్రీనివాసరాజు పరిశీలన చేపట్టారు. ఇందుకోసం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లను పరిశీలించారు. జెఇఓ వెంట టిటిడి ఎస్‌ఇ-2 రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇ ఓ కోదండరామారావు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి చెంచులక్ష్మి, విజివోలు రవీంద్రారెడ్డి, విమలాకుమారి తదితరులు ఉన్నారు.