సాహితి

ఏమో! ఏమీ తెలియకున్నది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురు లేత కొమ్మలంటే ఇష్టం
నాకు వసంత రుతువంటే మరీ ఇష్టం
నీవు వాటికంటే ఇష్టం

కోయిల పాటంటే ఇష్టం
నీ మాట దానికంటే ఇష్టం
నీరెండ పొలుపంటే ఎంతో ఇష్టం
గోధూళీ పసిడివొనె్నలద్దుకున్న
నీ రూపు మరీ మరీ ఇష్టం

ఇంకా...
ఏదో చెప్పాలి, ఎట్ల చెప్పాలే...
ఉగ్రకృష్ణవేణి గలగలల నురగలంటే ఇష్టం
అలలపై తేలాడే హంసలంటే ఇష్టం
కానీ నడక... నడక తీరు మరింతిష్టం

శరదృతువు చంద్రుడంటే వల్లమాలిన ఇష్టం
అనంతానంత ఓల్టేజీ వెలుగులు వెదజల్లే
నీ ఉనికి బాగా ఇష్టం
పొడిచే పొద్దు.. మోదుగుపువ్వనె్న సాయంకాలాలిష్టం
వీటిని ఓర్పు.. నేర్పుతో చిత్రకపట్టే
నీ కనుపాపలింకా ఇష్టం

పారిజాత పుష్పాలంటే ఇష్టం
నిరంతరం నీళ్లను ముద్దాడే తామరలంటే ఇష్టం
తళుకుబెళుకుల నీటి మెరుపులంటే ఇష్టం
నీవింకా ఇష్టం
వరూధుని, దమయంతంటే చెప్పలేనంతిష్టం
ఖండాంతర ఖ్యాతి పొందిన
ప్రేమైక జీవులంటే మరింతిష్టం
వీళ్లకంటే నీవే ఇష్టం

కరుణశ్రీ పాద పంక్తులంటే ఇష్టం
వేమన తత్వమంటే ఇష్టం
వాగొడ్డున రాలిన విరుల పాన్పులంటే ఇష్టం
కృష్ణశాస్ర్తీ, ఆత్రేయల కవితా కాంతల పలవరింతలిష్టం
నిజం చెప్పనా
వాటన్నింటికంటే నీవే ఇష్టం

ఇంకా..
ఏం చెప్పాలే.. ఎట్ల చెప్పాలే
మునిమాపటేల మక్కజొన్న పూత సువాసనిష్టం
నాలుగు చినుకులు తనపై వాలితే
గుబాళించే మట్టివాసనిష్టం
నీ చెమట సుగంధ పరిమళం
వర్ణింప తరం గానంతిష్టం

మొనాలిసా ముగ్ధత ఇష్టం
వయ్యారి బాపుబొమ్మలంటే బహు ఇష్టం
వీళ్ళిద్దరిని మూటగట్టుకున్న
అందానికి అద్దమైన నీవు సెప్పతరంగానంతిష్టం

ఇంకా...
ఏం చెప్పాలే.. ఎట్ల చెప్పాలే
కాంతిని పంచే సూర్యుడిష్టం
చల్లదనాల చంద్రుడిష్టం
చెమ్మగిల్లిన కండ్లిష్టం
ఇవన్నీ కలగల్సిన నీవంటే మరింతిష్టం
స్వార్థం ఎరుగని తేనెటీగలిష్టం
కంటికింపైన పువ్వులిష్టం
ఈ గుణాలను సొంతం చేసుకున్న నీవంటేనే ఇష్టం

సత్యభామ అంటే ఇష్టం
వాక్కులమ్మ అన్నా ఇష్టం
సీతాదేవంటే ఇష్టం
నీతికి నిలువెత్తు బొమ్మవైనందుకు
నీవంటే మరి ఇష్టం

ఇంకా..
ఏం చెప్పాలే.. ఎట్ల చెప్పాలే
పంచభూతాలిష్టం
అష్టదిక్పాలకులంటే ఇష్టం
ఆది, అంతం లేని కాలం సాక్షిగా
నీవు ఎంతో ఇష్టం

ఇంకా...
ఏం చెప్పాలే... ఎట్ల చెప్పాలే
ఏమో, ఏమీ తెలియకున్నది!

- బుచ్చన్న గోర్ల, 8790999116