కర్నూల్

వైకాపా అభ్యర్థిగా శిల్పా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూన్ 25:నంద్యాల అసెంబ్లీకి జరుగనున్న ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైకాపా తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి తమ మాట నెగ్గించుకుని వైకాపా అభ్యర్థిగా ఆదివారం అధిష్టానం ఆధ్వర్యంలో ఎంపిక చేయబడ్డారు. వారం రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డిని ఉప ఎన్నిక అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. దీంతో ఉప ఎన్నికపోరు టిడిపి-వైకాపా మధ్య రసవత్తరంగా మారింది. టిడిపిలో తమకు టికెట్ రాదన్న విషయాన్ని పసిగట్టిన శిల్పా మోహన్‌రెడ్డి తమ క్యాడర్‌తో పాటు వైకాపాలో చేరి అధిష్టానం వద్ద తమ పంతం నెగ్గించుకున్నారు. పార్టీ ఏదైనా ఉప ఎన్నికల బరిలో తాను వుంటేనే తమ క్యాడర్ నిలుస్తుందని టిడిపికి ఎన్నిసార్లు వివరించినా ఆ పార్టీ పెడచెవిన పెట్టడంవల్ల శిల్పా మోహన్‌రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకున్న 10 రోజుల్లోనే ఉప ఎన్నికల పోరులో అభ్యర్థిగా నిలిచారు. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలవాలన్న కృతనిశ్చయంతో తెలుగుదేశం పార్టీ నంద్యాల పట్టణంలో ప్రభుత్వం తరుపున ఇఫ్తార్‌విందును ఏర్పాటు చేసి ముస్లిం మైనార్టీ ఓట్లకు గాలం వేసింది. ఉప ఎన్నికలో బ్రహ్మానందరెడ్డి గెలిచితీరాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారిగా నంద్యాలలో బసచేసి టిడిపి నాయకులందరినీ సమన్వయపరిచి సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులు నంద్యాలకు మంజూరు చేస్తున్నట్లు శిలాఫలకాలు ఆవిష్కరించి వెళ్ళారు. దీంతో శిల్పా మోహన్‌రెడ్డి శిబిరంలో లుకలుకలు మొదలై 23 మంది కౌన్సిలర్లతో వైకాపాలో చేరిన శిల్పాకు నేడు 15 మంది కౌన్సిలర్లే మిగిలారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరిక చేయడంతో మరికొంతమంది కౌన్సిలర్లు టిడిపి వైపు ముగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నంద్యాల ఉప ఎన్నిక పోరు అధికార, ప్రతిపక్ష పార్టీలకు మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. నిన్నటి వరకు ఉప ఎన్నికలో వైకాపా టికెట్ తమకే వస్తుందన్న నమ్మకంతో వున్న రాజగోపాల్‌రెడ్డి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకాలం వైకాపా ఇన్‌చార్జిగా వుంటూ డబ్బు ఖర్చుచేసి అంగబలం పెంచుకున్న రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు వైకాపా అభ్యర్థికి మద్దతు ఇస్తారా లేదా మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్నది వేచిచూడాల్సి వుంది. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నిక బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అధికారపార్టీ అభ్యర్థిగా అధికారుల అండదండలతో నెగ్గుకువస్తారా లేకా టిడిపి వ్యతిరేక ఓటు, ముస్లిం మైనార్టీల వైఖరి వల్ల టిడిపికి నష్టం జరుగుతుందా అనూహ్యంగా వైకాపా అభ్యర్ధి గెలుస్తారా అన్నదానిపై రాజకీయ మేథావులు చర్చించుకుంటున్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నిక ఇరుకూటములు ఆయా పార్టీలకు ఎగ్జిట్ పోల్స్‌గా నిలుస్తాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.