కర్నూల్

ప్రజల్లో భద్రతాభావం పెంపొందిస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 26:ప్రజల్లో భద్రతా భావం పెంపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నూతన ఎస్పీ గోపీనాథ్‌జెట్టి పేర్కొన్నారు. ఆయన సోమవారం మధ్యా హ్నం ఆకే రవికృష్ణ నుంచి జిల్లా నూత న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలు లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తొలుత జిల్లాలోని ముస్లింలు, పోలీసు కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు వ్యవస్థ సేవలు మరింత మెరుగయ్యేందుకు కృషి చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. తద్వారా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువస్తామన్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలను సమన్వయపరస్తూ, ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయంతో ఆహర్నిషలు కృషి చేస్తూ పోలీసు వ్యవస్థపై ప్రజల్లో గౌరవం పెంపొందిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అధికారులందరూ టెక్నాలజీ ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి సమస్యలున్నా ప్రజలు పోలీసులను సంప్రదించి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఎస్పీ తెలిపారు. కాగా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి స్వగ్రామం నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కరబలవోలు. 2008వ బ్యాచ్‌కు చెందిన ఆయన మంగళగిరి బెటాలియన్‌లో పని చేస్తూ బదిలీపై కర్నూలు జిల్లాకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ గోపీనాథ్‌జెట్టి కర్నూలు రేంజ్ డిఐజి రమణకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఎస్పీని ఏఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు, జిల్లా పోలీసు అధికారుల సంఘం సభ్యులు కలిసి అభినందనలు తెలిపారు.