కర్నూల్

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జూన్ 26: ప్రముఖ శైవక్షేత్రంగా విరజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని సేవించుకున్నారు. మూడు రోజులు సెలవులు కావడంతో దేశ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకొని స్వామి, అమ్మవార్లను దర్శించుకొనేందుకు పోటీ పడ్డారు. భక్తులు అధికంగా రావడంతో ఆలయ అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేశారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ వేళల్లో మార్పులతో పాటు భక్తులందరికీ సంతృప్తికరంగా స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉన్నత స్థాయి అధికారులు కింది స్థాయి ఉద్యోగులకు ప్రత్యేక విధులు కేటాయించి అధికారులు అప్రమత్తంగా ఉండి పర్యవేక్షిస్తూ భక్తులందరికీ సంపూర్ణంగా దర్శనం అందించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి తెల్లవారుజాము నుండే స్వామి, అమ్మవార్లను దర్శించుకొనేందుకు వేచి వున్నారు. మూడు రోజులు సెలవుదినాలు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకోవడంతో అటు దేవస్థానం వారు, ఇటు సత్రాల వారు శ్రీశైలం చేరుకున్న భక్తులకు వసతి సౌకర్యాలను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఆన్‌లైన్ బుక్కింగ్ కావడంతో ఆన్‌లైన్ చేసుకోవడం తెలియని సామాన్య భక్తులకు వసతి సౌకర్యం పూర్తిగా అందలేదని సత్రాల వారు రూములను వారికి అనుకూలమైన వారికి ఇచ్చుకోవడంతో భక్తులకు వసతి సరిగా లేక, గుడి ముందుభాగంలోని మండపాలలో, రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై పడుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తులు వాపోతున్నారు.