మెదక్

బోరు గుంతలు పూడ్చివేయాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జూన్ 26: ‘కాలుపడితే కాటికే’ శీర్షికన ఆంధ్రభూమిలో సోమవారం ప్రచురితమైన వార్తకు డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి స్పందించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా వృథాగా నోళ్లు తెరుచుకుని ఉన్న బోరు గుంతలు ంటే వాటిని వెంటనే పూడ్చివేయించాలని ఆర్‌డిఓ నగేశ్‌ను ఆదేశించారు. గ్రామ స్థాయిలో విఆర్‌ఓ ఇతర అధికారులను పురమాయించి ఎక్కడ కూడా ప్రమాదకరంగా ఉన్న బోరు గుంతలను పూడ్చివేయించాలన్నారు. స్థానిక యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు కూడా ప్రమాదకరమైన బోరు గుంతలను గుర్తించి వాటిని పూడ్చివేయడానికి సహకరించాలని సూచించారు. ప్రమాదాలు జరిగాక అయ్యో అనకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు.
వ్యవసాయ భూముల వద్దనే అధికంగా బోరు గుంతలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా ప్రమాదకర బోరు గుంతలు కనిపిస్తే స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్‌డిఓను ఆదేశించారు. ఇప్పటికే తహశీల్దార్‌లకు ఆదేశాలిచ్చినట్లు ఆర్‌డిఓ డిప్యూటీ స్పీకర్ దృష్టికి తెచ్చారు. మరోసారి అధికారులను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు.