ఖమ్మం

మంత్రి తుమ్మల సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 26: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం రూరల్ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. పలు గ్రామాలలో ద్విచక్రవాహనం, జీపుపై తిరిగి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి తొలుత గూడూరుపాడు గ్రామపంచాయతీ శివారు పిట్టలవారిగూడెం గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంకరమిల్లు నుంచి వెలువడే వ్యర్థపదార్థాలను చెరువులో పోస్తున్నారని, కొందరు వ్యక్తులు చెరువును ఆక్రమించారని విన్నవించారు. మంత్రి వెంటనే స్పందించి కంకరమిల్లు వ్యర్థాలను వెంటనే తొలగించాలని సిఐ తిరుపతిరెడ్డికి సూచించారు. చెరువును సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని తహశీల్దార్ నరసింహారావును ఆదేశించారు. పిట్టలవారిగూడెం నుంచి ఆరెకోడుతండాకు రోడ్డు వేయాలని స్థానికులు కోరారు. అనంతరం తనగంపాడు మీదుగా గుండాలతండా వరకు మంత్రి ద్విచక్రవాహనంపై ఆతరువాత జీపుపై పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. గుండాలతండా వాగు, మంగళగూడెం చెరువు గురించి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలు గుండాలతండా-తనగంపాడు, తనగంపాడు-ముల్కలపల్లి, ఊటవాగుతండా-గూడూరుపాడు గ్రామాలకు రోడ్లు నిర్మించాలని మంత్రిని కోరగా వెంటనే మంజూరీ చేశారు. అనంతరం మునే్నరుపై నిర్మించిన గోళ్ళపాడు కట్టును పరిశీలించారు. గోళ్ళపాడు కట్టు ఎత్తును పెంచాలని నీటిపారుదల శాఖ ఎస్‌ఇకి సూచించారు. మరో రెండు అడుగుల ఎత్తు పెంచితే నీటిమట్టం కూడా మరింత పెరిగి రెండు పంటలు సమృద్ధిగా పండుతాయని, తీర్థాల జాతర సమయంలో నీటి ఎద్దడి కూడా ఏర్పడదని స్థానికులు మంత్రికి సూచించారు. అదేవిధంగా మారెమ్మతల్లి దేవాలయం నుంచి కరుణగిరి వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఖమ్మంలోని వైఎస్‌ఆర్ నగర్‌లో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ళను, నగరంలోని ఎనె్నస్పి కాలనీలో నిర్మిస్తున్న మాంసం మార్కెట్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాలేరు ఆత్మ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, నాగచంద్రారెడ్డి, బెల్లం వేణుగోపాల్, రామ్మూర్తినాయక్, గుర్రం వెంకట్రామయ్య, అశోక్, పంతులు, కొప్పుల ఆంజనేయులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.