ఖమ్మం

వారసత్వ ఉద్యోగాల కోసం మరోపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 26: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం మరోపోరాటం చేపడతామని జాతీయ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం, సింగరేణి యాజమాన్యం మూలాఖత్ అయ్యి సమ్మెను నీరు గార్చాయని ఆరోపించారు. సోమవారం స్థానిక పివికె మైన్ వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో దమ్మలపాటి శేషయ్య, నాగభూషణం, మందానరసింహరావు, జయరాం, గంగాధర్‌లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి కార్మికులను మోసంచేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా కార్మిక ప్రయోజనాలకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. సమ్మెను నీరుగార్చిన టిబిజికెఎస్‌కు త్వరలోనే కార్మికులు బుద్ది చెప్పడం ఖాయం అని అన్నారు. జాతీయ కార్మిక సంఘాలకు వస్తున్న ఆధరణ చూసి ఓర్వలేకే సింగరేణి యాజమాన్యం కార్మికులను ప్రలోభాలకు గురిచేసి తప్పుడు లెక్కలతో అధిక ఉత్పత్తి సాధించినట్లు ప్రకటించిందన్నారు. డెఫ్యూటీ లెబర్ కమీషనర్ సింగరేణి యాజమాన్యాన్ని చర్చలకు పిలిపించినప్పటికీ చర్చలకు రాకుండా యాజమాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్నారు. దీంతో అనివార్యంగా సమ్మెను తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేయాల్సివచ్చిందని ప్రకటించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులను చైతన్య పర్చాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కూసన వీరభద్రయ్య, రమణారెడ్డి, విజయగిరి శ్రీనివాస్, సాంబమూర్తి, రాజ్‌కుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.