అనంతపురం

ఘనంగా రంజాన్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూన్ 26: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను నగరంలో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం సోమవారం రంజాన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రంజాన్ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్ధలకు వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. చిన్నా పెద్దా అన్న తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు ధరించి, భక్త్భివంతో ప్రార్థనలకు వచ్చారు. జడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్‌మొద్దీన్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పరిటాల శ్రీరామ్, ముతవల్లి కెఎం.షఫివుల్లా రంజాన్ ప్రార్థనలకు హాజరయ్యారు. ప్రభుత్వ ఖాజి అబ్దుల్ మజీద్ ఖురాన్ సూక్తులను వినిపించి, ప్రార్థనలు చేయించారు. ముస్లింల జీవితంలో రంజాన్‌కు ఎంతో ప్రాధాన్యత కలదని, ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ రంజాన్ మాసంలో ఆవిర్భవించిందన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించాలన్నారు. ప్రార్థనల అనంతరం ముతవల్లి కెఎం.షఫివుల్లాకు ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, జడ్పీ చైర్మన్ చమన్, పరిటాల శ్రీరామ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ షకిల్‌షఫికి, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్‌మొద్దీన్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా ఈద్గా మైదానం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. డాగ్ స్క్వాడ్‌తో ఈద్గా వద్ద పరిశీలించారు. రంజాన్ సందర్భంగా పలువురు మైనార్టీలు జిల్లా మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీతను నగరంలోని వారి నివాసాలకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం నగర కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు మున్వర్, సాయినగర్ మసీదు మాజీ ముతవల్లీ చాంద్‌బాషా, నగర మైనార్టీ కార్యదర్శి హాజీవలి, దాదాఖలందర్, మేవా నాయకులు ఫకృద్దీన్ తదితరులు మంత్రుల నివాసాలకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కూడా మైనార్టీ నేతలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు.
పామిడిలో...
పామిడి : రంజాన్ పవిత్ర ఉపవాసాల మాసం ముగింపు రోజైన సోమవారం పట్టణంలోని ఈద్గా మైదానంలో ఈద్ ఉల్ ఫితర్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలతో వేలాదిమంది ముస్లింలు పండుగ పవిత్రతను చాటి చెప్పారు. పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు ముస్లింలను కలిసి రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. హిందూ- ముస్లిం బాయ్‌బాయ్ అంటూ ఒకరికొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
బుక్కరాయసముద్రంలో...
బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండలంలో రంజాన్ పండుగ వేడుకలను ముస్లింలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఈద్- ఉల్-్ఫతరన్ పురస్కరించుకుని ముస్లింలు ఈద్‌గా, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలలో మత గురువులు మత పెద్దలు, ముత్తువలిలు రంజాన్ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి బోధనలు నిర్వహించారు. అనంతరం ఆలింగనాలతో రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.