జాతీయ వార్తలు

రాష్టప్రతి పదవికి మీరా నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: రాష్టప్రతి పదవికి ప్రతిపక్షం అభ్యర్థిగా రంగంలోకి దిగిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బుధవారం ఉదయం 11.30కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్‌సిపి నాయకుడు శరద్ పవార్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ కార్యదర్శి డి రాజాతోపాటు కర్నాటక సిఎం సిద్దరామయ్య, పంజాబ్ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పాండిచ్చేరి సిఎం నారాయణ స్వామి, హిమాచల్ సిఎం వీరభద్రసింగ్‌తోపాటు యుపిఏ మిత్రపక్షాల నేతలు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. సోనియా గాంధీ నాయకత్వంలో మీరాకుమార్, ఇతర నాయకులు పార్లమెంటు ఒకటో నంబర్ గేటునుండి లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా గదివరకు ఊరేగింపుగా వచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కెవిపి రామచందర్‌రావు, ఎంఏ ఖాన్, రేణుకా చౌదరి, ఆనంద భాస్కర్ ఊరేగింపులో పాల్గొన్నారు. మీరాకుమార్ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను మిశ్రాకు అందజేశారు. అనూప్ మిశ్రా దాదాపు పది నిమిషాలపాటు నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం ఆమెకు రసీదు ఇచ్చారు.
సిద్ధాంతపరమైన పోరాటం
సిద్ధాంతపరమైన పోరాటంలో భాగంగానే రాష్టప్రతి పదవికి మీరాకుమార్ పోటీ చేస్తున్నారని సోనియా గాంధీ చెప్పారు. సిద్ధాంతపరమైన, సత్యం కోసం చేస్తున్న పోరాటమే ఈ ఎన్నిక అని వ్యాఖ్యానించారు. మీరాకుమార్ శుక్రవారం గుజరాత్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. మొదట సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటిస్తారు. తరువాత కాంగ్రెస్, మిత్రిపక్షాల ఎంపీలు, శాసనసభ్యులతో సమావేమవుతారు. మీరాకుమార్ తెలుగు రాష్ట్రాల పర్యటనలో కొంత గందరగోళం నెలకొంది. మొదట జూలై 3న విజయవాడ వెళ్లేలా పర్యటన ఖరారు చేశారు. అయితే విజయవాడ వెళ్లేబదులు హైదరాబాదులోనే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధులను కలుసుకోవటం మంచిదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సూచించినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ నుండి మీరాకుమార్‌కు నలుగురు రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, ఎంఏ ఖాన్, టి సుబ్బిరామిరెడ్డి, చిరంజీవి ఓట్లు పడతాయి. ఈ నలుగురి కోసం ఆమె విజయవాడ వెళ్లే బదులు హైదరాబాదులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీలను కలుసుకోవచ్చని సూచిస్తున్నట్టు తెలిసింది.
చిత్రం.. నామినేషన్ దాఖలు సందర్భంగా మీరాకుమార్‌తో తరలివచ్చిన సోనియా, మన్మోహన్, వామపక్ష నేతలు