జాతీయ వార్తలు

ఆధారే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: జూలై ఒకటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతోంది. జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగే చారిత్రక సమావేశంలో ఈ పరోక్ష పన్నుల వ్యవస్థ ఆవిష్కృతమవుతుంది. కేంద్రంలోని ఎన్డీ ఏ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో అడుగు వేసుకుంటూ, అన్ని రాష్ట్రాల ఆమోదం పొందుతూ, జీ ఎస్టీ వ్యవస్థ ఓ స్పష్టమైన రూపును సంతరించుకుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను వల్ల అనేకరకాలుగా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో మొత్తం పన్నులను నాలుగు శ్లాబులుగా విభజించి అమలు చేయటం ద్వారా ఇప్పటి వరకు కొనసాగిన గందరగోళ పరిస్థితులకు ఈ వ్యవస్థ చెల్లుచీటీ పలుకుతుంది. జీ ఎస్టీ వల్ల సామాన్యులకు ఒరిగేదేమిటి? వ్యాపార వాణిజ్య రంగాలకు తరిగేదేమిటన్న విషయాన్ని పక్కన పెడితే ఈ కొత్త విధానం అమలుతో అనేక ఇతర మార్పులు చోటు చేసుకుంటాయి. జూలై ఒకటి నుంచి జీ ఎస్టీ వల్ల కాకుండా ఇతరత్రా వచ్చే ప్రధానమైన మార్పులకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావలసి ఉంటుంది. వాటిలో ప్రధానంగా వచ్చే మార్పులు ఆధార్ లేకుండా ఇంకెంతమాత్రం ఐటి రిటర్న్‌లు దఖలు పరిచే అవకాశం ఉండదు. ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆదాయం పన్ను దాఖలు చేయాలంటే ఆధార్ తప్పనిసరి చేయటం వల్ల ఇది ఇక అనివార్యమే అవుతుంది. అదేవిధంగా పాన్ నెంబర్‌తో ఆధార్ నెంబర్‌ను చేర్చటమూ ఇక తప్పనిసరి. అనేక నకిలీ పాన్ కార్డులు రావటం వల్ల ముందుజాగ్రత్త చర్యగా వీటికి ఆధార్‌ను అనుసంధానం చేయటమే కాకుండా ప్రభుత్వం తప్పనిసరిగా కూడా మార్చింది. అంటే డూప్లికేట్ పాన్‌తో పన్నులు ఎగవేయటం ఇక ఎంతమాత్రం సాధ్యం కాదు. ఆదాయం పన్ను చట్టం లోని 139( ఏ ఏ) సెక్షన్ ప్రకారం పాన్ నెంబర్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయకపోతే ఆ పాన్‌కార్డు ఇక చెల్లదన్న మాట. అదేవిధంగా ఆధార్ కార్డు లేకుండా కొత్తగా పాన్ కార్డు పొందే అవకాశం కూడా ఇక ఉండదు. శనివారం నుంచే ఆధార్ లేనిదే ఏవరికీ పాన్ కార్డు వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా పాస్‌పోర్ట్ పొందాలన్నా కూడా పాస్‌పోర్ట్ ఇక తప్పనిసరిగా మార్చింది. ఇందుకోసం దాఖలు చేసే దరఖాస్తుతో చేర్చాల్సిన కీలక పత్రాలలో ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా కోటాను కోట్ల మంది సభ్యత్వం కలిగిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకూ ఆధార్ తప్పనిసరి కాబోతోంది. ఇప్పటికే ఈపి ఎఫ్ ఓ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పెన్షనర్లు కూడా ఆధార్‌ను జత చేయాల్సి ఉంటుంది. ఆధార్‌తో దీన్ని అనుసంధానం చేయటం వల్ల విత్‌డ్రావల్స్, సెటిల్‌మెంట్ ప్రక్రియ మరింత సులభతరంగా తక్కువ వ్యవధిలోనే పూర్తవుతుందని ఈ పి ఎఫ్ ఓ తెలిపింది. అంటే కొత్త విధానం వల్ల పది రోజుల్లోనే ఈ వ్యవహారాలు పూర్తవుతాయన్న మాట. రైల్వే టిక్కెట్లపై రాయితీలు పొందాలన్నా కూడా జూలై ఒకటి నుంచి ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ విషయంలో జరిగిన లోపాలను ఈ విధానం వల్ల తొలగించే అవకాశం ఉంటుందని భారతీయ రైల్వే స్పష్టం చేసింది. అలాగే స్కూళ్లు కాలేజీల్లో స్కాలర్‌షిప్‌లు పొందాలన్నా కూడా ఆధార్ నెంబర్‌ను అనివార్యంగా విద్యార్థులు అందించాల్సి ఉంటుంది. అంటే జూన్ 30లోగానే ప్రతి విద్యార్థి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ గడువు దాటితే ఏ విద్యార్థికి స్కాలర్‌షిప్‌లు ఇచ్చే అవకాశం ఉండదని జనశక్తి వనరుల శాఖ స్పష్టం చేసింది. అలాగే అత్యంత కీలకమైన ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను పొందాలన్నా ఆధార్ తప్పనిసరి కాబోతోంది. ఇది ఉంటేనే ప్రభుత్వపరమైన సబ్సిడీలు పొందేందుకు అర్హత ఉంటుంది.
చిత్రం.. జిఎస్టీ అమలు తరువాత ఔషధాల ధరలు పెరగొచ్చన్న అంచనాతో ముందస్తు కొనుగోలుకు క్యూగట్టిన కోల్‌కతా వాసులు