జాతీయ వార్తలు

స్వదేశానికి చేరుకున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. అమెరికా, పోర్చుగల్, నెదర్లాండ్‌లో పర్యటించిన మోదీ అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన పర్యటన ఫలప్రదమైంది. మోదీకి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఘనస్వాగతం పలికారు. ప్రధాని మూడు దేశాల పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిపిన భేటీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉగ్రవాదం నిరోధానికి పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు దేశాధినేతలు నిర్ణయించారు. పోర్చుగల్‌తో తొలి పర్యటన చేసిన మోదీ ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టాతో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. నెదర్లాండ్‌లో ప్రధాని మార్క్ రుట్టేతో అనేక అంశాలపై చర్చించారు. ఎన్నారైలతోమాట్లాడారు.
33 గంటలు విమానంలోనే!
పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్‌లో నాలుకు రోజుల పాటు (120) గంటలు పర్యటించిన ప్రధాని మోదీ 33 గంటలు ఎయిర్ ఇండియా వన్‌లో ప్రయాణిస్తూనే గడిపారు. 24న పోర్చుగల్ వెళ్లిన మోదీ రాత్రి ఎక్కడా ఆగకుండా అదేరోజు సాయంత్రం వాషింగ్టన్ బయలుదేరారు. ఎనిమిది గంటలు ప్రయాణించి స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం అమెరికా చేరుకున్నారు. సోమవారం రాత్రి అమ్‌స్టెర్‌డం బయలుదేరారు. ప్రయాణంలోనూ నిద్రపోయారు. నెదర్లాండ్స్‌లో 12 గంటలు కూడా ఆగకుండా స్వదేశానికి బయలు దేరారు.
చిత్రం.. స్వదేశానికి చేరుకున్న మోదీకి స్వాగతం చెబుతున్న సుష్మా స్వరాజ్