క్రీడాభూమి

సరైనోడు రవిశాస్ర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతుండగా, మంగళవారం దరఖాస్తు చేసుకున్న జట్టు మాజీ కెప్టెన్, మాజీ డైరెక్టర్ రవి శాస్ర్తీ ఈ రేసులో ముందున్నాడన్న వాదన తెరపైకి వచ్చింది. డంకన్ ఫ్లెచర్ కోచ్‌గా ఉన్నప్పుడు, టీమిండియాకు అతను సమర్థమైన మార్గదర్శకాన్ని అందించడం లేదని బిసిసిఐ అనుమానించింది. అందుకే, అతనిని దాదాపుగా పక్కకు ఉంచి, కొత్తగా డైరెక్టర్ పదవిని సృష్టించి, దానిని రవి శాస్ర్తీకి అప్పగించింది. ఒక రకంగా చెప్పాలంటే, పేరుకు మాత్రమే డంకన్ ఫ్లెచర్ కోచ్. కానీ, అతని బాధ్యతలన్నీ డైరెక్టర్ హోదాలో రవి శాస్ర్తీ తీసేసుకున్నాడు. చివరికి నెట్ ప్రాక్టీస్ సమయంలోనూ టీమిండియా క్రికెటర్లు డంకన్ ఫ్లెచర్‌ను కాకుండా రవి శాస్ర్తీనే సంప్రదించేవారు. వ్యూహ రచన కూడా అతని సూచనలతోనే చేసేవారు. డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్టు ముగిసిన తర్వాత, కొత్త కోచ్‌ని ఎంపిక చేయనున్నట్టు బిసిసిఐ ప్రకటించగా, సహజంగానే రవి శాస్ర్తీకే పట్టం కడతారని అనుకున్నారు. కానీ, ఇంటర్వ్యూ సమయంలో అందుబాటులో లేకపోవడంతో, సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా మండలి (సిఎసి) కోచ్ పగ్గాలను అనిల్ కుంబ్లేకు అప్పగించింది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో కుంబ్లే కాంట్రాక్టును బిసిసిఐ పొడిగించలేదు. కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది. మొదట కుంబ్లే దరఖాస్తు చేసున్నప్పటికీ, ఆతర్వాత మనసు మార్చుకొని, రాజీనామా చేశాడు. దీనితో కంగుతిన్న బిసిసిఐ మరికొన్ని దరఖాస్తులను అందుకునేందుకు వీలుగా గడువును జూలై 9వ తేదీ వరకూ పొడిగించింది. కుంబ్లే వైదొలగడం, దరఖాస్తులకు గడువు పెంచడం రవి శాస్ర్తీని ఆకట్టుకున్నాయి. అతను కూడా దరఖాస్తు చేసుకోవడంతో, నిన్న మొన్నటి వరకూ వినిపించిన పేర్లు వెనక్కు వెళ్లాయి. రవి శాస్ర్తీ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నది.
ప్రత్యేక అర్హతలు!
మిగతా వారితో పోలిస్తే రవి శాస్ర్తీకి కొన్ని ప్రత్యేక అర్హతలున్నాయి. వాటిలో మొదటిది అతనికి టీమిండియా క్రికెటర్లతో సాన్నిహిత్యం ఉండడం. జట్టు కోచ్ హోదాలో అతను ప్రస్తుత జట్టులోని చాలా మంది క్రికెటర్లతో కలిసి పని చేశాడు. ఆటగాళ్లను శాసించకపోవడం కోచ్ పదవిని దక్కించుకునేందుకు అతనికి ఉన్న రెండో ప్రత్యేక అర్హతగా చెప్పుకోవాలి. ప్రాక్టీస్ సెషన్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని, సమయ పాలనను ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని కుంబ్లే ఆదేశించడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీసహా ఆటగాళ్లలో ఎవరికీ నచ్చలేదు. మైదానంలోకి దిగిన ప్రతిసారీ సర్వశక్తులు ఒడ్డాలని, సాధ్యమైనంత వరకూ అత్యుత్తమ సేవలు అందించాలని కుంబ్లే పదేపదే చెప్పడాన్ని కూడా క్రికెటర్లు జీర్ణించుకోలేకపోయారు. పదేపదే విఫలమయ్యే వారు జట్టులో చోటు కోల్పోతారని హెచ్చరించిన కుంబ్లే ఆటగాళ్లందరికీ పగవాడయ్యాడు. అందుకే అతను పదవిని వదులుకోవాల్సి వచ్చింది. కానీ, రవి శాస్ర్తీకి వీటిలో ఏ ఒక్కటీ పట్టదు. క్రమ శిక్షణ గురించి మాట్లాడడు. ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాకపోయినా నోరు మెదపడు. అర్ధ రాత్రి వరకూ పార్టీలు, పబ్‌లు అని తిరిగినా ఇదేమటని నిలదీయడు. అనుసరించాల్సిన వ్యూహాలపై పెద్దగా జోక్యం చేసుకోడు. అన్నింటినీ మించి కెప్టెన్‌కు పూర్తి స్వేచ్ఛనిస్తాడు. కెప్టెన్ కోహ్లీకి కావాల్సింది అదే. జట్టు తన కనుసన్నల్లో నడవాలని కోరుకునే అతనికి రవి శాస్ర్తీని మించి సర్దుకుపోయే వారు ఎవరు దొరుకుతారని క్రికెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కుంబ్లే పదవిని కోల్పోవడానికి దారి తీసిన పరిస్థితులు రవి శాస్ర్తీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురుకావని ఈ వర్గాల అంచనా. ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’ అనే అతను బాగానే వంటిబట్టించుకున్నాడని క్రికెట్ విశే్లషకుల అభిప్రాయం. అందుకే, మిగతా వారితో పోలిస్తే, రవి శాస్ర్తీకే కోచ్ పదవి దక్కడం ఖాయమన్న వాదన బలపడుతున్నది. అతని దరఖాస్తుపై సిఎసి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అంత వరకూ సస్పెన్స్ తప్పదు.