సాహితి

కవిత్వం కవి ప్రతిరూపం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉ్పళూక ఆ్దజశ క్యఖ ష్ఘశ జ్ఘ్జౄశళ జఒ గళ్ఘ’’
-్ఘఇ్య -జష్ఘఒఒ్య
కవులు ఎన్ని రకాలుగా ఊహిస్తే కవితలు అన్ని విధాలుగా వర్షిస్తాయ. అంతర్లీనంలోంచి బహిర్గతమయ్యే నూతన భావాలు అనుభూతుల రంగుల్లో మనల్ని జలకాలాడిస్తాయ... అక్షరాలు అవేగాని అంతరంగంలోంచి ఉబికి వచ్చిన కొత్తదనాలు కొత్త భాషని కాగితాలపై విడుదల చేస్తే కళ్లు వాక్యాలవెంట పరుగిడుతూ చూపుల్లోకి ఇంద్రధనుస్సుల్ని మునకలేపిస్తాయ.. స్పందించేవారి జీవిత గుడారాల్లో నిరంతరం కాపురముంటాయ.. అనుభూతించి చిత్రించిన కవితలు లోకమంతా విస్తరిస్తాయ.
మట్టికి నీరు తోడైతే చాలు ఆకుపచ్చని ఆకాశాన్ని భూమిపై మొలకెత్తిస్తుంది. మట్టితో నీరు జరిపే సంయోగక్రియ ముందు సకల జీవవృక్ష జలాల సంపర్కం బలాదూర్ అనిపిస్తుంది. భూమితో వానకలిసిన ప్రతిసారి పచ్చదనమే, పూలవనమే, ధాన్యపు గుట్టలే, కావ్యాల కట్టలే, కవిత్వం వర్షించినప్పుడు తనువు ఒక తేనె తుట్టెగా మారుతుంది. శ్వాస పూలబుట్టగా సువాసననిస్తుంది. అద్భుతమైన ఆ కవితాచరణాల్ని నాలుక నెమరువేస్తూ హృదయపు ఆకలిని తీరుస్తుంటుంది. ఆ విషయం కళని ఆస్వాదించేవారికే తెలుస్తుంది.
‘క్యూఖ తీజ శళ్పళూ చిజశజూ ఘ ఘూజశఇ్యతీ జచి క్యఖ ఘూళ య్యరీజశ జ్యూతీశ’’ ళ్ద్ఘూజళ ళ్ద్ఘఔఔజశ
ఎవరి కవిత వారి భొటనవేలి గురుతువంటిదైతే, మరొకరి కవితతో పోల్చడానికి ఆస్కారముందు. ఎవరి రూపం వారిదై మరొకరి రూపంతో పోలిక తేవడానికి అవకాశముండదో అలాగే కవిత తన భావ సారూప్యంతో తనదిగా ఓలలాడినప్పుడు తన భావనా రూపమే తొణికిసలాడుతుంది కాని మరో రూపం అగుపించదు. అద్దం ఎవరి ముఖాన్ని వారికే చూపిస్తుందిగాని మరొకరి వదనాన్ని చూపించదు. కవి ‘రూపం’ అయితే అద్దంలో తన ‘ప్రతిరూపం’ కవిత.
ఒకే వస్తువును ఎన్ని విధాలుగానైనా చెప్పవచ్చు, లోహాన్ని కాని, కర్రని కానీ ఎన్నో రూపాలుగా తయారు చేస్తున్నట్టే, ఒక్కొక్కరు తమ అనుభూతిని తమదైన శైలితో కవితగా మార్చడంతో ఆ కవిత నూతనంగా లోకంలో ఆవిష్కరించబడుతుంది. కాని ఉద్యమాల కవితల్లో మాత్రం ఒకరు చెప్పిన విషయానే్న అదే మూసతో ప్రతి ఒక్కరు ప్రతిసారి చెప్పడంతో కవిత కనుమరుగై ముడిసరుకు మనకు కనిపిస్తుంది. ఉద్యమానికి ప్రేరణ మాట దేవుడెరుగు విసుగనిపిస్తుంది. ఒకే భావజాలపు ‘యూనిఫాం’ వేసుకున్నట్టు అన్ని కవితలూ ఒకేలా అగుపించి స్పందన కలిగించదు సరికదా! అలా వ్రాయకపోతేనే సాహితీప్రియుల్ని పది కాలాలు బ్రతికించిన వారవుతారనిపిస్తుంది. పడికట్టు పదాలతో అరిగిపోయిన భావాలతో, విసిగేసే నినాదాలతో రాయకపోవడమన్నది సాహిత్యానికి మేలుచేసే విషయమనిపిస్తుంది. కొందరు వ్రాయకపోవడంతో సరిపెట్టుకుంటే సాహిత్యానికి కీడు చేయనివాళ్లుగా చరిత్రలో మిగిలిపోవడానికి అవకాశముంటుంది. ఏదిబడితే అది ఎట్లబడితే అట్ల రాయకపోవడంవలన సాహిత్యాన్ని బ్రతికించిన వాళ్లవుతారనడానికి ఏమాత్రం సంశయం అక్కర్లేదనిపిస్తుంది.
ఎవరి కవిత వారి నిజూళశఆజఆకగా, ఎవరి నిజూళశఆజఆక వారి కవిత్వమైనప్పుడే సాహిత్యం జీవిస్తుంది. కాలమేదైనా జీవిస్తూనే వుంటుంది. కవులు సాహితీపరులు తమని తాము స్పష్టంగా విడుదల చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది, తమలోని తాత్వికత బహిర్గతమైనప్పుడు ప్రతి వాక్యం నూతన విన్యాసం చేస్తుంది. ప్రతి అక్షరం వినూత్న నక్షత్రంగా మెరుస్తుంది. కవిత్వానికి శాశ్వతత్వం లభిస్తుంది. శాశ్వతమంటేనే కవిత్వమని కాలం నిరూపిస్తుంది. నిరూపిస్తోంది, నిరూపిస్తూనే వుంటుంది.
‘్దళ ఇళఒఆ ఔ్యళఆక ద్ఘఒ జఆఒ య్యూఆఒ జశ ఆ్దళ ఒఖఇష్యశఒషజ్యఖఒ, క్యఖఆ్ద, శ్ఘజ్పళఆక, ళ్ఘశషళ యశ జశఒఆజశషఆ యూౄళఆ్ద్ఘశ ళ్ఘూశజశ ఘశజూ ౄళఆ్ద్యజూ. ఒళశఒళ యఛి చిళళజ్యూౄ ఘశజూ ఔ్ఘక, ళ్పళశ ఆఖఒఆ జశ ఘూశజ్యూౄశళఒ,జఒ శళషళఒఒ్ఘక ఆ్య ఆ్దళ ఘౄరీజశ యఛి ఘ ఔ్యళౄ’’ ఘక డతీళశఒ్యశ.
లోకంలోని తనలోని అన్ని మూలల్ని అందరూ తడమలేరు, చూడలేరు, చూసినా కొందరు వ్రాయరు, మరికొందరు దాటేస్తారు అలాంటి వాటిని ఎవరూ చూడని మూలల్ని, దాటేసినవాటిని స్పష్టంగా చెప్పడం కొందరి కవితల్లో కనిపిస్తుంది. ఒక్కో కవిత మనం ఊహించని ఎత్తుగడలతో మనల్ని కమ్మేస్తుంది. లోపలి పొరల్ని కుమ్మేస్తుంది... అదే పనిగా... పనిగట్టుకుని కవితలు చెప్పినట్టు అగుపించవు, సహజసిద్ధంగా అవి అలాఅలా అలలై అలరారుతుంటాయ్. ఎరుకతో కూడిన తన స్థితిలోంచి ఉద్భవించిన ఒక మార్మికతలకి స్పష్టమైన రూపాలుగా అగుపిస్తుంటాయ్. ఇంతవరకు ఇలాంటి కవితల్ని చూడలేదేననిపించేవిధంగా భావానికి కొత్త భాషని తొడిగిన విధంగా మనకు కనిపిస్తుంటాయ్.
కవితలు ఉద్రేకపరచడం, పరచకపోవడం, ఉత్తేజపరచడం, పరచకపోవడమన్నది శైలినిబట్టి వుంటుంది. అలాగని ఏ కవితా స్తబ్ధతకు తావివ్వనిదే, అనవసర ఆలోచనలకి చోటివ్వనిదే, మంచి కవితగా మనకు అగుపిస్తుంది. ఏ మూలో మాయ తెరపై దాగిన ఛాయల్ని మన కళ్లముందు బహిర్గతపరచి హృదయ తెరపై దర్శింపచేస్తాయ్. మనల్ని మనకే చూపిస్తాయ్. సంతోష విషాదాల్ని సమతూకంతోనూ ఒక్కోసారి విషాదాన్ని ఆనందంగాను, దుఃఖాన్ని సంతోషంగానూ చెప్పేటప్పుడు కళ్లలో కన్నీటి పొరల్ని ఉబికించి చటుక్కున ఆ కన్నీళ్ళని కళ్లలోకే ఇంకిపోయేలా చేస్తాయ్. ఒక్క కన్నీటి చుక్కను కూడా వృధా చేయక కనురెప్పల నుంచి జారనీయక అంతరాంతరాల్లోకి అంతర్లీనంగా ఆవిరయేలా చేస్తాయ్.. బహుశా సమూహంలో వున్నా ఏకాంతంలో వుండటం, ఏకాంతంలో వున్నా సమూహమై విస్తరించడం. ఏకాంత, సమూహాల రెండు హస్తాలు తనవిగా చేసుకుని దోస్తీ కట్టడం కవితలో ప్రవేశపెట్టిన కొత్త విద్య అనిపిస్తుంది. అందరికీ అగుపించని దృశ్యాల్ని పట్టుకోవడంలో సహజ నేర్పు. ఒంటరితనంతో ఓలలాడితేగాని ఒంటబట్టనివి మన ఎదుట బట్టబయలు చేసే విధానం తెలిసి పట్టపగలే చుక్కల నడుమ జాబిలిని చేర్చే కూర్పు, తనతో తాను తనలో తాను ఒంటరి, అందరికి సహచరి. అసలైన కవితా ఝరి. కొన్ని కలలు మనకి మెలకువ వచ్చినప్పుడు గురుతుంటాయ్... మరికొన్ని కలలు ఎంత ఆలోచించినా, ఎంత తవ్వినా స్ఫురణకు రానేరావ్... గురుతుకు రాని, స్ఫురణకు రాని ఆలోచించి తవ్వినా బయటికి రాని కలల్ని కవితలుగా మలచడం నూతన కవితకి తెలిసిన స్వప్నవిద్య.
కంటికి కనపడని చిరుగాలి ఆకుల్ని కదిలిస్తున్నప్పుడు పూలు విడుదల చేసే పుప్పొడి సువాసనల చిత్రీకరణలు మనకు కొన్ని కవితల్లో కళ్లకు కూడా పరిమళాలందిస్తాయ్.
ఏటి ఒడ్డున నిలిచి సెలయేటిలోని నీటి గలగలని చెవులు అందుకోవడం ఓ అనుభూతి. ఏటిలోకి దిగి ప్రవాహానికి చెవులానించి ప్రవహించే నీటి గలగలలు వినడంలో మనం పొందేది ఓ గొప్ప రసానుభూతి. ఎవరి నుంచైనా అటువంటి కవితలు వెలువడినప్పుడు మనం పొందేది సహానుభూతి.
ఎడారిలో తడవని ప్రవేశాల్ని చినుకుల తడి తడిమితే ఆ ప్రాంతపుటెడారి ఎలా పులకిస్తుందో, ఎవరూ అడుగిడని అడవిలోకి వెళ్లినప్పుడు ఎప్పుడూ చూడని అడవి పూలు గుప్పుమని మన కళ్లలోకి రంగుల్ని వెదజల్లినప్పుడు మనసు ఎలా తన్మయిస్తుందో, పరిసరాల్ని మరచి మనకు మనమే పరిసరాలైపోయిన వైనంతో మన హృదయం వాన వచ్చినప్పుడు పిల్లకాలువల్లో చిన్న పిల్లై గంతులేస్తుందో, కవితల్లో కొన్ని వాక్యాలు చదివినప్పుడు మనకు తెలియని అడవిలో మనం అనుభూతిస్తాం. ఎడారి జీవితంలో సైతం వసంతాన్ని అనుభవిస్తాం.
ఈ పదం తర్వాత ఈపదమే వుండాలి, ఈ అక్షరం తదుపరి ఈ అక్షరమే వుండి తీరాలి అనే తెచ్చిపెట్టుకున్న (అ)మర్యాదపూర్వక (అ)క్రమ పద్ధతిలో ఒకే మూసగా కవితలని మొదలుపెట్టక తనకెలా స్ఫురించిందో అలానే సక్రమంగా కవితల్ని మొదలు పెట్టడంతో కవితలు ఓ వింతైన కొత్త అనుభూతిని కలుగజేస్తాయ్. హఠాత్తుగా మొదలైన కవిత హఠాత్తుగానే ముగుస్తుంది. వాక్యాల రాసులకంటే అక్షరాల వాసిలో భావ నివాసి మనకగుపిస్తుంది. ఎంతటి భావాన్నైనా చిన్న కవితలో చెప్పడం. కవిత్వంలో కొండ అద్దమందు కొంచమై ఉండటమేనని అక్షరాల సాక్షిగా నిర్దేశిస్తుంది.
‘ని య్పళ ఆ్దళ జదఆ త్యీజూఒ. ని దజశరీ ళష్యశ్యౄక ఘశజూ ఔళషజఒజ్యశ యఛి ఘశఖ్ఘ్ళ ఘూళ జౄఔ్యఆ్ఘశఆ’’
ళ్దళఒళ్ఘ ళజశఆ్యశ
కవిత గాఢతని సంతరించుకొని సహానుభూతిపరునికి గాఢమైన స్పందనని కలిగిస్తుంది. మహావృక్షాన్ని విత్తనంలో, ఆకాశమంత భావాన్ని అక్షరంలో మెరిపించడంతో కాలాన్నిగాని, కాగితాన్నిగాని వృధా చేయడం జరగదనిపిస్తుంది.
కవితల్లో ఆవేదన అంతర్లీనంగా ప్రవహించినప్పుడే వేదనని అనుభవించడం జరుగుతుంది. కవిత్వం అన్నింటిని ఆవిష్కరిస్తూ వెళుతూ మనిషిలోనితనాన్ని విశే్లషిస్తూంటుంది. కాలంలోని మార్పుల్ని, మార్పులు చెందుతున్న మనిషిలోని మనిషి మనస్థత్వాన్ని వివరిస్తూ కాలరేఖపై జీవిత పాశ్వాల్ని లిఖిస్తూ వెళుతూనే వుంటుంది.
కాలాన్ని రచనతో స్వరీకరిస్తూ పోతుంటుందేగాని, మందులోనే మునిగిపోదు నీళ్ల గ్లాసులో వేసినా, సముద్రంలో పడదోసినా బెండు (కార్కు)లాగే తేలియాడుతూ వుంది. అన్ని కాలాలకి అగుపించే జీవిత రచనే కవిత్వం. గత వర్తమాన భవిష్యత్‌లను ఏకకాలంలో తనదిగా చేసుకొని సాగిపోవడమే కవిత్వ శాశ్వత లక్షణం.
శూన్యం నుంచి పుడమి ఆవిర్భమైనట్టే మనిషి ఊహలోంచి కవిత్వం పురుడు పోసుకుంది. శరీరంలో ప్రాణమున్నట్టే కవిత్వంలో జీవముంటుంది. శరీరాలు శాశ్వతం కాకపోయినా కవిత్వం మాత్రం లోకంలో కదలాడుతూ జీవనదీ ప్రవాహమై ప్రవహిస్తూనే వుంటుంది.
‘్దళ ష్యఒళూ క్యఖ ష్యౄళ ఆ్య రీశ్యతీజశ ఆ్ద్ఘఆ క్యఖ ఘ్యశళ షూళ్ఘఆళ ఆ్దళ త్యీజూ యఛి క్యఖూ ళనఔళూజళశషళ, ఆ్దళ యూౄళ పజఆ్ఘ జఆ ఇళష్యౄళఒ చ్యి క్యఖ ఆ్య జూజఒష్య్పళూ ఖఒఆ త్ద్యీ జఒ జ్యూజశ ఆ్దళ షూళ్ఘఆజశ’’ ఉజషౄజష్ద్ఘళ ళ్పళశఆ్ద్ఘ
కవిత్వం సమూహంలోని ఏకాంతాన్ని ఏకాకితనాన్ని బహిర్గత ఫరుస్తుంది. ఏకాకితనంలోని ఏకాంతాన్ని సమూహంలోనూ ప్రదర్శిస్తుంది. చక్రం ఒకేలా వృత్తాకారాన్ని కలిగివున్నా లోకాన్నంతా చుట్టినట్టు కవిత్వం ఏ భాషలో వున్నా ప్రపంచాన్ని చుట్టుముడుతూనే వుంటుంది.
ఆశ్చర్యమేమిటంటే మనిషి సముద్రతీరాల ఆవలున్నా, ఎవరికివారు తెలియకున్నా అక్కడా ఆ తీరాల్లో కవిత్వం ఉద్భవించింది, ఇక్కడా ఈ తీరాల్లోనూ కవిత్వం ఉదయించింది. మనిషి అంతరంగంలోంచి మొట్టమొదటిసారిగా వచ్చిన తన స్థితే కవిత్వమై జనించింది. హల్లులు లేని భాషలో సైతం అచ్చులుగా హావభావాలు రూపు దిద్దుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కవిత్వం నాడూ నేడూ ఏకాంత సమూహాల వారధి, మానవ జీవన జీవిత రథసారధి. అవును! ఎవరి కవితా రచన వారి బొటనవేలి గురుతైనప్పుడు వేరొకరిని స్ఫురింపచేయదు. కవిత్వంలోనూ వ్యక్తిత్వం అగుపించినప్పుడు తనదైన శైలి సాహితీ చరిత్రలో శాశ్వతమై నిలిచిపోక తప్పదు.

- యక్కలూరి వై శ్రీరాములు, 9985688922