స్పాట్ లైట్

ఇరాక్... బహుపరాక్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్‌ఖైదా తర్వాత ప్రపంచ దేశాల్ని వణికించిన ఇస్లామిక్ తీవ్రాద సంస్థ ఐసిస్ అంతమైనట్టేనా?మూడేళ్ల క్రితం జూలైలోనే ఐసిస్ నేత అబూ బకర్ అల్-బాగ్దాదీ తననుతాను ఖలీఫాగా ప్రకటించుకున్న మొసూల్‌లోని అల్‌నూరి మసీదును ఇరాకీ దళాలు హస్తగతం చేసుకోవడంతోనే ఈ భయానక తీవ్రవాద సంస్థ పట్టు సడలినట్టేనా? అల్‌ఖైదా సృష్టించిన బీభత్సం కంటే ఎన్నో రెట్లు భయానక వాతావరణాన్ని ఐసిస్ రేకెత్తించింది. దాదాపు అన్ని దేశాల్లోనూ సైద్ధాంతిక బలంతో యువతను ఆకర్షించి తన పట్టును పెంచుకునేందుకు చివరి క్షణం వరకూ ప్రయత్నించింది. మూడేళ్ల వరకూ ఈ మసీదే ‘ఖలీఫా‘సామ్రాజానికి ప్రతికగా, పెట్టని కోటగా కొనసాగింది. వారాల తరబడి మొసూల్‌ను హస్తగతం చేసుకునేందుకు ఇరాఖీ దళాలు చేయని పోరాటం లేదు. అమెరికా సహా అనేక దేశాలు ఐసిస్‌ను అంతం చేసేందుకు తమ శక్తియుక్తులన్నింటినీ వినియోగించాయి. మొసూల్ పట్టణం ఇరాక్ ప్రభుత్వం చేజిక్కడంతో కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఐసిస్ పరిమితమయ్యే అవకాశం ఉంది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటే తప్ప ఐసిస్‌ను పూర్తిస్థాయిలో తుడిచిపెట్టేశామని భావించడానికి వీల్లేదు. కుంభస్థలాన్ని కొట్టారు కాబట్టి మిగతా చోట్ల నుంచీ ఐసిస్‌ను తరిమేయడం అన్నది పెద్ద పనికాకపోయినా అత్యంత వ్యూహాత్మక రీతిలోనే ఇరాక్ ప్రభుత్వం అడుగులు వేయాల్సి ఉంటుంది. అప్పుడే పూర్తిస్థాయి విజయం సాధించినట్టవుతుంది. ఓ పక్క ఆత్మాహుతి దాడులు సాగిస్తూనే ఐసిస్ దళాలు ఇరాకీ సైన్యాన్ని ఎనిమిది నెలల పాటు ముప్పుతిప్పలు పెట్టాయి. పట్టువదలని రీతిలో సైన్యం ముందుకు సాగడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. దాదాపు పదిలక్షల మంది ప్రజలు నివసిస్తున్న మొసూల్ పట్టణ ప్రజలు ఈ ఎనిమిది నెలల కాలంలో నరకయాతనే అనుభవించారు. ఇళ్లను వదిలి తలదాచుకునేందుకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని సుదూర ప్రాంతాలకు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకూ తరలిపోయారు. చివరి క్షణం వరకూ పట్టువదలని రీతిలో మొసూల్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడమే అంతిమ లక్ష్యంగా ప్రధాని హైదర్ అల్-అబ్దాదీ వ్యవహరించడం వల్లే ఈ విజయం సాధ్యమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉగ్రవాదం మొత్తం ప్రపంచ శాంతికే గొడ్డలి పెట్టు అని భావించినప్పుడే దాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయడం సాధ్యమవుతుందని చెప్పడానికి ఐసిస్‌ను ఎదుర్కోవడంలో పొరుగున ఉన్న ఇరాన్ షియాలు, కుర్దులు ఇరాక్‌కు పూర్తిసాయం అందించడమే నిదర్శనం. అలాగే అమెరికా కూడా రక్షణ పరంగా ఎంతగానో ఇరాక్‌ను ఆదుకుంది. తన సాధన సంపత్తిని, వైమానిక బలాన్నీ అందించింది. కొన్ని విషయాల్లో ఇరాన్‌కు ఇరాక్‌కు పొసగక పోయినా రెండు దేశాలు కలిసి పనిచేశాయి. ఇరాన్‌తో అనేక రకాలుగా సంబంధాలు బెడిసికొట్టినా కూడా ఐసిస్ భూతాన్ని తరిమికొట్టడంలో అమెరికా ముందుండి యుద్ధాన్ని నడిపించడం ప్రపంచ శాంతికి శుభసంకేతం.