జాతీయ వార్తలు

తమిళనాడు సిఎంకు సుప్రీం షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు నగదు, బంగారం ఎరవేశారన్న వ్యవహారాన్ని పరిశీలించేందుకు బుధవారం సుప్రీం కోర్టు అంగీకరించింది. గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. పళనిస్వామికి మద్దతు ఇవ్వాలంటూ శశికళ వర్గం ఎమ్మెల్యేలకు భారీఎత్తున నగదు, బంగారం ఎవరేసినట్టు ఓ ఆంగ్ల చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. అప్పటి బలపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో పళనిస్వామి గెలిచిన విషయం తెలిసిందే. తనకు రెండుకోట్ల నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు ఇవ్వజూపారని పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన సౌత్ మధురై ఎమ్మెల్యే శరవణన్ స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడించారు. దీన్ని ప్రతిపక్ష డిఎంకె గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. స్టింగ్ ఆపరేషన్‌పై విచారణ జరపాలంటూ అసెంబ్లీని స్తంభింపచేసింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సహాయం కోరింది. కేసు విచారణ తేదీని మాత్రం నిర్ధారించలేదు.