జాతీయ వార్తలు

న్యాయవ్యవస్థనే అవహేళన చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: వివాదాస్పద న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు పూర్తి పాఠాన్ని వెలువరించింది. మొత్తం న్యాయవ్యవస్థనే అవహేళన చేసే రీతిలో కర్ణన్ చేష్టలు, తీర్పులు, ప్రకటనలు సాగాయని సుప్రీం కోర్టు తెలిపింది. కర్ణన్‌కు ఆరు నెలల జైలు శిక్ష ఏయే కారణాలతో విధించామన్న అంశంపై సవివరమైన రీతిలో ఈ తీర్పు పాఠాన్ని వెలువరించింది. కర్ణన్ కేసు దురదృష్టకరమే అయినప్పటికీ హైకోర్టు న్యాయమూర్తే ఆ రకమైన చర్యలకు పాల్పడటం, మీడియాలో న్యాయవ్యవస్థపై ప్రతికూల అభిప్రాయాలకు దారితీసిందని సుప్రీం కోర్టు పేర్కొంది. దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా కర్ణన్ తీర్పులకు సంబంధించి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపింది. కర్ణన్‌కు సంబంధించి నిష్పాక్షిక రీతిలో తమ తీర్పుకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని ఏడుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఎవరిపట్లా ఎలాంటి వ్యితిరేకత, విధేయత లేకుండా నిష్పాక్షికంగానే న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పును వెలువరించటం జరిగిందని పేర్కొంది. కోర్ట్ధుక్కార కేసులో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సమయంలో కర్ణన్ వ్యవహారం శ్రుతి మించిపోయిందని సుప్రీం బెంచ్ తెలిపింది.