రుచి

తియ్య తియ్యగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతిలో లభించే పండ్లు ఆరోగ్య పరంగా మంచిది. సమతుల్య ఆహారం తిన్నామంటే పండ్లు కూడా ఆహారంగా తీసుకుంటేనే సాధ్యం. పిల్లలు కొన్నిరకాల పండ్లను తినటానికి ఇష్టపడరు. వారికి ఆయా పండ్లలోని విటమిన్లు అందాలంటే వాటిని తియ్యగా, పుల్లగా హల్వా చేసి తినిపిస్తే సరిపోతుంది. కొన్నిరకాల ఆహార పదార్థాలు కూడా రోగనిరోధక శక్తిగా ఉపయోగపడతాయి. ఇటువంటి ఆహారపదార్థాల్లో హల్వా కూడా చేరుతుంది. మరికొన్ని పండ్లతో తయారుచేసుకునే హల్వాలు గురించి తెలుసుకుందాం.

పందిరి దోస
పందిరి దోస ముక్కలు - 5 కప్పులు, పంచదార - 2 కప్పులు, గసగసాల పొడి -1/2 కప్పు, నెయ్యి - 1/2 కప్పు, వేరుశెనగ పప్పు - 1/2 కప్పు, ఏలకులు - 6
విధానం:ముందుగా పప్పులన్నీ నేతిలో దోరగా వేయించాలి. దానిలో పందిరి దోస ముక్కలు వేసి మగ్గనివ్వాలి. మెత్తగా ఉడికాక గరిటతో ముద్దగా బాణలిలోకి నెనపాలి. దీనికి పంచదార చేర్చి మిగతా నెయ్యి వేసి మగ్గనివ్వాలి. ఇది బుడగలు వస్తూ ఉడికాక గసగసాల పొడి, వేరుశెనగ పలుకులు వేసి ఏలకుల పొడి వేసి కలిపి ఉడికించి దింపాలి. పళ్ళానికి నెయ్యి రాసి ఈ మిశ్రమం పోసి సర్దాలి. చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచితే గట్టిపడుతుంది. నచ్చిన ఆకృతిలో ముక్కలు చేసుకోవాలి.

పైనాపిల్‌తో
పైనాపిల్ ముక్కలు - 4 కప్పులు, బెల్లం - 1 కప్పు, ఖర్జూరం ముక్కలు - 1 కప్పు, ఏలకులు -6, నెయ్యి - 1/2 కప్పు, పుట్నాల పొడి - 1 కప్పు
జీడిపప్పు - 12, ఉప్పు - చిటికెడు
విధానం:ముందుగా పైనాపిల్ పండు ముక్కలు మిక్సీ పట్టాలి. బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి తీసి ఖర్జూరం ముక్కలు వేయించి తీసి పక్కన పెట్టాలి. బాణలిలో మిగతా నెయ్యి వేసి అనాస ముద్ద వేసి కలిపి బెల్లం వేసి కలపాలి. మిశ్రమం బెల్లం పాకంతో ఉడికాక పుట్నాల పొడి, ఏలకుల పొడివేసి కలిపి జీడిపప్పులు వేసి కలిపి పళ్లానికి నెయ్యి రాసి మిశ్రమం పోసి సర్ది ముక్కలుగా చేసుకోవాలి.

జామతో
పండు జామపళ్ళు - 6, నెయ్యి - 1/2 కప్పు, బెల్లం - 1 కప్పు, పంచదార - 1/2 కప్పు
కిస్‌మిస్‌లు - 12, చెర్రీలు - 12, ఏలకులు - 8, వేయించిన శెనగపిండి - 1/2 కప్పు, నువ్వుల పొడి - 1/2 కప్పు, జీడిపప్పులు - 12
విధానం:జామ ముక్కలు ఒక గుడ్డలో కట్టి మరుగుతున్న నీటిలో ఉంచి మగ్గించాలి. దీన్ని తీసి మిక్సీ పట్టాలి. బాణలిలో నెయ్యి వేసి ఈ మిశ్రమం వేసి మగ్గనివ్వాలి. ఇపుడు వేయించిన నువ్వులపొడి, కిస్‌మిస్‌లు, చెల్రు తీసి పక్కన పెట్టాలి. ఇపుడు బెల్లం, పంచదార చేర్చి మిశ్రమం ఉడకనివ్వాలి. బుడగలు వస్తుండగా దింపి పళ్లెంలో పోసి సర్ది కిస్‌మిస్‌లు, చెర్రీలతో అలంకరించి ఫ్రిజ్‌లో ఉంచితే ముక్కలు బాగా తయారు అవుతాయి. బయటకు తీసి జీడిపప్పులతో అలంకరించాలి.

సీతాఫలంతో
సీతాఫలం ముద్ద - 2 కప్పులు, ఏలకులు - 8, దాల్చిన చెక్కలు - 2, నెయ్యి - 1/4 కప్పు, కోవా - 1/2 కప్పు
కొబ్బరి కోరు - 1/2 కప్పు, జీడిపప్పులు - 12, నువ్వుల పొడి - 1/4 కప్పు, పంచదార - 1 కప్పు
సిల్వర్ పేపర్
విధానం: ముందుగా నెయ్యి కరిగించి కొబ్బరి కోరు జీడిపప్పులు వేయించి తియ్యాలి. దాల్చిన చెక్కలు ఏలకులు పొడి చెయ్యాలి. బాణలిలో సీతాఫలం గుజ్జు, కోవా చేర్చి పంచదార చేర్చి కలిపి నువ్వుల పొడి కలిపి జీడిపప్పులు వేసి కలిపి దింపాలి. పళ్లానికి నెయ్యి రాసి సిల్వర్ పేపర్ అతికి గట్టిపడ్డాక ముక్కలు చేసుకోవాలి.

- వాణి నారుమంచి