జాతీయ వార్తలు

నకిలీ కుల పత్రాలతో ఉద్యోగాలు పొందితే వేటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగా నియామకాలు పొందిన ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాలనుంచి తొలగించడం జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఇలాంటి అక్రమ చర్యలకు అడ్డుకట్ట వేయడానికి కుల ధ్రువీకరణ పత్రాలను సకాలంలో వెరిఫై చేయని లేదా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించడం జరిగిందని కూడా ఆయన చెప్పారు. నకిలీ లేదా తప్పుడు కులధ్రువీకరణ పత్రాల ఆధారంగా నియామకాలు పొందిన వారి గురించిన సమాచారాన్ని సేకరించే ప్రక్రియను కేంద్రం 2010లో చేపట్టింది. అలాంటి సమాచారాన్ని సేకరించి, ఆ తర్వాత వారిపై తీసుకున్న చర్యల వివరాలతో సమగ్ర నివేదికలను సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించాలని ఈ ఏడాది జూన్ 1న అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఉద్యోగం పొందడం కోసం ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తప్పుడు కులధ్రువీకరణ సర్ట్ఫికెట్‌ను సమర్పించినట్లు తేలితే సర్వీస్ రూల్స్‌లోని నిబంధనల ప్రకారం అతడ్ని తొలగించడానికి, లేదా బర్తరఫ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఆ ఆదేశాల్లో స్పష్టం చేయడం జరిగిందని లోక్‌సభలో ఓ లిఖితపూర్వక సమాధానంలో మంత్రి చెప్పారు.