జాతీయ వార్తలు

విభేదాలు వివాదాలు కారాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: డోక్లామ్‌లో ఏర్పడిన సం క్షోభానికి శాంతియుత పరిష్కారం జరగాలని భారత్ పేర్కొంది. విభేదాలు ఏవైనా ఉంటే అవి వివాదాలుగా మారకముందే దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి గోపాల్ బాగలే గురువారం విలేఖరులతో అన్నారు. ఈ వ్యవహారంలో సరిహద్దుల్లో చైనాతోపాటు ఉన్న మరో దేశం భూటాన్‌తో సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వివరించారు.
‘చైనాతో సరిహద్దు వ్యవహారాలపై శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలన్నదే భారత్ అభిమతం’ అని ఆయన స్పష్టం చేశారు. ఆస్తానాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ల మధ్య షాంఘాయ్ సహకార సంస్థ సమావేశం నేపథ్యంలో జరిగిన సమావేశంలో విభేదాలను వివాదాల స్థాయికి తీసుకుపోకూడదని ఇద్దరు నేతలూ అభిప్రాయపడ్డారని ఆయన వివరించారు. బాధ్యతాయుతమైన ఏ దేశానికైనా వివిధ అంశాలపై శాంతియుతంగా వ్యవహరించటమే సరైనదని గోపాల్ వ్యాఖ్యానించారు. ఈ నెల 27న జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్ బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నారని బాగలే ధ్రువీకరించారు. దాదాపు నెల రోజులుగా సిక్కింలోని డోక్లామ్ సెక్టార్‌లో భారత, చైనా బలగాలు పరస్పరం మోహరించి ఉద్రిక్తతలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
వివాదాస్పద ప్రాంతంలో చైనా సైనికులు రోడ్డు నిర్మాణానికి చేసిన ప్రయత్నాలను భారత సైన్యం అడ్డుకున్న సంగతి తెలిసిందే. తన భూభాగంలోనే రోడ్డు నిర్మిస్తున్నామని చైనా వాదిస్తోంది. కానీ, భారత్, భూటాన్ మాత్రం ఆ ప్రాంతం భారత్ భూభాగమని పేర్కొంటున్నాయి.
భారత సైన్యాలు తక్షణం వెనక్కి పోవాలని చైనా హెచ్చరికలను భారత్ బేఖాతరు చేసింది. అప్పటినుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.