ఖమ్మం

కార్పొరేషన్‌లో ముదురుతున్న వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 20: ఖమ్మం కార్పొరేషన్‌లో మేయర్, కార్పొరేటర్ల మధ్య వివాదం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు బాహాటంగానే ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. దీనిపై టిఆర్‌ఎస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్పొరేషన్‌లో అధికారం చేజిక్కించుకున్న నాటి నుంచి మేయర్‌కు కార్పొరేటర్లతో పొసగడం లేదు. దీనిపై పలుమార్లు స్థానిక శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్ళినా సర్దుబాటు ధోరణిలోనే చెప్పుకొచ్చారు. రెండు రోజుల క్రితం మేయర్, డిప్యూటీ మేయర్‌ల మధ్య కార్పొరేషన్ కార్యాలయంలోనే వివాదం జరగడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మేయర్ కార్పొరేటర్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా తన ఇష్టమొచ్చిన రీతిలో పనిచేస్తున్నారని అనేక మంది ఆరోపణలు గుప్పించారు. ఒకరిద్దరు కార్పొరేటర్లను వెంటేసుకొని స్థానిక కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా పనులు జరుపుతున్నారని, కార్యాలయంలో కార్పొరేటర్లకు విలువ లేకుండా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అధికారం చేజిక్కించుకున్న నాటి నుంచి మేయర్, డిప్యూటీ మేయర్ల మధ్య ఉన్న వివాదం పరిష్కరించే నేతలు లేకపోవడంతో అది ఇప్పుడు తీవ్రమైంది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అత్యంత సన్నిహితునిగా పేరున్న డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్ మేయర్ పాపాలాల్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కార్పొరేటర్ల ఫోన్లు ఎత్తడం లేదని, వారేదైనా చెబితే స్పందించడం లేదని, ఆయనతో పనిచేయడం కష్టంగా ఉందని చెప్పినట్లు తెలిసింది. దీనిపై మంత్రి కూడా మేయర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలోనే కొందరు కార్పొరేటర్లు మేయర్ వైఖరిపై ఫిర్యాదు చేసిన అంశాన్ని గుర్తుచేస్తూ విధానాలు మార్చుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా ఖమ్మం కార్పొరేషన్‌లో అంతా తామై వ్యవహరిస్తున్న ముగ్గురు కార్పొరేటర్లపై కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముగ్గురు కార్పొరేటర్లు మేయర్‌తో కలిసి ఇతరుల ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారని, కార్పొరేషన్ కార్యాలయంలో ఆధిపత్యం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజలతో ఉండకుండా గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై ఎమ్మెల్యే అజయ్‌కుమార్ కూడా కార్పొరేటర్లను మందలించినట్లు తెలుస్తోంది.