ఖమ్మం

భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూలై 21: భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ తగ్గుముఖం పట్టింది. తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన గోదావరి అనూహ్యంగా గురువారం 24 గంటల్లో 16 అడుగులకు చేరింది. గురువారం అర్థరాత్రికి నీటిమట్టం 37.2 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నీటిమట్టం శుక్రవారం ఉదయం నుంచి నిలకడగా ఉంది. శుక్రవారం రాత్రికి 34.7 అడుగులుగా ఉంది. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు నదులు ఉప్పొంగడంతో గోదావరికి వరద పోటు వచ్చింది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు వరద చేరుకునే అవకాశం ఉందని అధికారులు తొలుత భావించారు. శుక్రవారం ఉదయం నుంచి గంటకో అంగుళం చొప్పున నిదానంగా వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరద వచ్చే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉండగా అధికారులు సెక్టోరియల్ అధికారులు అప్రమత్తం చేశారు. తాలిపేరు ప్రాజెక్టు వద్ద కూడా వరద ఉధృతి తగ్గడంతో గోదావరికి వరద పోటు తప్పినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. శనివారం ఉదయానికి 30 అడుగులకు తగ్గుతుందని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి వరద ముంపు లేదని అధికారులు తెలిపారు.