హైదరాబాద్

బాచుపల్లిలో కలెక్టర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 21: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి గ్రామంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈనెల 24న మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ సమీపంలోని ఆరెకరాల ప్రభుత్వ స్థలంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా అధికారులు చేస్తున్న పిట్స్ త్రవ్వకాలను ఎంవిరెడ్డి పరిశీలించారు. బాచుపల్లి సర్పంచ్ ఆగం పాండు.. విశ్వ విద్యాలయం ప్రక్కన సర్వే నెంబర్ 186లోని ప్రభుత్వ స్థలంలో మూడు గ్రామాలకు కేటాయించిన చెత్త డంపింగ్ యార్డ్‌ను ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే డంప్ యార్డ్‌ను కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే కెపి వివేక్, జడ్‌పి వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపిపి కవిత పాల్గొన్నారు.