హైదరాబాద్

పాతబస్తీలో మళ్లీ ‘చబుత్ర’ ఆపరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, జూలై 22: పాతబస్తీలో నేరాలను తగ్గించేందుకు దక్షిణ మండలం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలతో పాటు ‘చబుత్ర’ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. పాతబస్తీలో ఆర్ధరాత్రి బైక్‌లపై సంచరిస్తూ, రోడ్లపై వచ్చిపోయేవారికి ఇబ్బంది కలిగిస్తూ స్థానికులను అనేక మంది యువకులు స్థానికులను, మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బస్తీ మెయిన్‌రోడ్లను అడ్డగా మలుచుకుని యువకులు రోడ్డుపై వెళుతున్న వారిని తరుచు వేధిస్తున్నారు. ఈ క్రమంలో యువకులు అగడాలకు చెక్ పెట్టేందుకు గాను దక్షిణ మండలం పోలీసులు నడుంబిగించారు. ఈ క్రమంలో పోలీసులు చాంద్రాయణగుట్ట పోలీస్టేషన్ పరిధిలోని బార్కాస్, చాంద్రాయణగుట్టతో పాటు పాతబస్తీలోని అన్ని పోలీస్టేషన్‌ల పరిధిలోని ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 267 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దాడిలో దొరికిన 267 మంది యువకులను ఈ ఫింగర్ ప్రింట్ స్కానింగ్‌మిషన్ ద్వారా పరిళీలించగా వారిలో 30 మందిపై వివిధ కేసుల్లో నిందితులు, క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. పోలీసులు దాడిలో పట్టుబడ్డ యువకులను శనివారం ఉదయం స్థానిక గుల్జార్ ఫంక్షన్‌హాల్‌లో తల్లిదండ్రుల సమక్షంలో కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిపి సత్యనారాయణ మాట్లాడుతూ యువకులు చెడు అలవాట్లకు లోను కాకుండా వారిని సరైన మార్గంలో పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. గతంలో కూడా యువకుల మధ్య జరిగిన స్ట్రీట్‌ఫైట్‌లో విద్యార్థులు ప్రాణాలు సైతం కొల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పోలీస్ యంత్రాంగం ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్రధానంగా పాతబస్తీలో యువకులు లైసెన్స్‌లు లేకుండా బైక్‌లు నడుపడం, ఇతరులను భయభ్రంతులకు గురిచేయడం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. చబుత్ర ఆపరేషన్‌లో పట్టుబడిన యువకులచే డిసిపి ప్రమాణం చేయించారు. మళ్లీ పోలీసు తనిఖీలో పట్టుబడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలుకు పంపుతామని డిసిపి హెచ్చరించారు. ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ మిషన్ అధారంగా ఇప్పటి వరకు దేశ మొత్తంలో ఏడు లక్షల మంది నేరచరిత్ర కలిగిన వేలిముద్రలను సేకరించడం జరిగిందని, అందులో భాగంగానే తమ వద్ద ఉన్న ఫింగర్‌ప్రింట్ మిషన్ ద్వారా పోలీసుల తనిఖీలో దొరికిన వారిని సులువుగా వారి చరిత్రను కనుగొనుటకు వీలుంటుందన్నారు. దీంతో క్రిమినల్స్‌ను పట్టుకోవడం సులువు అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం అదనపు డిసిపి బాబారావు, చార్మినార్, ఫలక్‌నుమా ఎసిపిలు అశోక్‌చక్రవర్తి, తాజుద్దీన్ అహ్మద్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఛత్రినాఖ పోలీస్ ఇన్స్‌పెక్టర్లు వై.ప్రకాష్‌రెడ్డి, పులియాదగిరి, కె.మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలీసులకు పట్టుబడిన యువకులతో పోలీసు అధికారులు ప్రమాణం చేయించారు. తిరిగి ఏలాంటి కార్యక్రమాలకు పాల్పడమని యువకులు వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.