హైదరాబాద్

రైతు ఆత్మహత్యల నివారణలో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెతుల ఆత్మహత్యలను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి, ఆలిండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ నాయకులు, కార్యకర్తలు జైల్‌భరో, రాస్తారోకో, భైఠాయింపు నిర్వహించారు.
జైల్ భరో నిర్వహిస్తున్న సిపిఐ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అతుల్ కుమార్ మాట్లాడుతూ గడిచిన పదేళ్ల కాలంలో ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినా ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోలేదని ఆరోపించారు. ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేవని అన్నారు. ఆత్మహత్యలను నివారించడంలో కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలోని కెసిఆర్ సర్కార్ విఫలమయ్యారని మండిపడ్డారు.
లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు సమరశీల పోరాటాలతోనే సమస్యలు సాధించుకోవాలని అన్నారు. దేశం అందరిదని, ఏ ఒక్కరిది కాదని, అందరి వికాసం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని గద్దెనెక్కిన మోదీ సర్కార్.. ఆచరణలో వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. వంద రోజుల్లో నల్లధనం తీసుకువస్తామని చెప్పిన మోదీ.. ఒక్క రూపాయి కూడా తేలేదని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. రైతుల, పేదల పక్షాన నిలబడి సిపిఐ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలమల్లేశ్, జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగరావు, కార్యవర్గ సభ్యులు పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు నాయకులు రవీంద్రచారి, ఓరుగంటి యాదయ్య, రక్తపు నాగేశ్ గౌడ్, శ్రీశైలం గౌడ్, ప్రభులింగం, సయ్యద్ అఫ్సర్, శ్రీశైలం, రాములు యాదవ్, పాండురంగాచారి, యాదమ్మ, రహేన, వీరమ్మ, యాదమ్మ, యాదవరెడ్డి, నరేశ్‌కుమార్, సృజన పాల్గొన్నారు.

నీటి సరఫరాపై అధ్యయన కమిటీ

అల్వాల్, జూలై 24: కంటోనె్మంట్‌లో నీటి సరఫరా సమస్య శాశ్వతంగా పరిష్కరించటానికి అధ్యయన కమిటీని నియమించాలని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావుకు నివేదించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రులు టి. పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం కంటోనె్మంట్ బోర్డు కార్యాలయంలో ఎమ్మెల్యే జి. సాయన్న , జలమండలి ఎండి దానకిషోర్, కంటోనె్మంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ అధికారి యస్‌విఆర్ బాలకృష్ణ, బోర్డు సభ్యులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో అంతర్భాగమైన కంటోనె్మంట్ బోర్డు ప్రాంతంలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ ఇంకా చాలా కాలనీలు, బస్తీలకు సరైన నీటి సరాఫరా లైన్ లేకపోవటం, జలమండలి అధికారులు ప్రతి రోజు కంటోనె్మంట్ బోర్డు ప్రాంతానికి సరాఫరా చేస్తున్న నీటి సరాఫరాలలో వ్యత్యాసం ఉండటం వల్ల సమస్యలు వస్తున్న కారణంగా అన్ని అంశాలపైన చర్చించారు. కంటోనె్మంట్ బోర్డు ప్రాంతానికి జలమండలి ఒప్పందం ప్రకారం ప్రతి రోజు 55 లక్షల గ్యాలెన్‌ల నీటిని సరాఫరా చేస్తున్నారు. కానీ కంటోనె్మంట్ బోర్డు అధికారులు మాత్రం ప్రతి రోజు 40 లక్షల గ్యాలెన్‌ల నీటిని మాత్రమే సరాఫరా చేస్తున్నారనీ చెబుతున్నారు. నీటి బిల్లులు చెల్లించే అంశంలో వివాదం తలెత్తితే విషయం తెలుసుకొన్న మంత్రి కెటి రామరావు కంటోనె్మంట్ బోర్డు చెల్లించ వల్సిన బకాయల నుండి ఎనిమిది కోట్ల రూపాయలను మాఫీ చేశారు గత సంవత్సరం. అయితే, అధికారుల మధ్య వివాదం ఒక్కవైపు ఉంటే మరోవైపున కంటోనె్మంట్ బోర్డు అధికారులు సరాఫరాచెస్తున్న నీటి సరిపోవటంలేదనీ వారంలో రెండు సార్లుమాత్రమే నీటి సరాఫరా చేస్తున్నారు. దీని వల్ల తాగటానికి కూడా సరిగ్గా నీరు అందటంలేదనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కంటోనె్మంట్‌లో నీటి సమస్య తీర్చటానికి మంత్రి కెటిఆర్ సూచన మేరకు రాష్ట్ర మంత్రులు టి. శ్రీనివాస్ యాదవ్, టి. పద్మారావు కంటోనె్మంట్ ఎమ్మెల్యే జి. సాయన్నతో కలిసి అధికారులు, బోర్డు సభ్యులతో చర్చించారు. సమస్య పరిష్కరించటానికి తాత్కాలికంగా అధ్యన కమిటీని వేయాలనీ అందులో జలమండలి అధికారులు ఇద్దరు, కంటోనె్మంట్ బోర్డు అధికారులు ఇద్దరు, ఇద్దరు కంటోనె్మంట్ బోర్డు సభ్యులతో కలిసి కమిటీ వేసి వారు వార్డుల వారిగా అధ్యయనం చేసిన తర్వాత వారి సూచననల మేరకు మున్సిపల్ మంత్రి కెటి రామారావుకు నివేదిక సమర్పిస్తారనీ, కంటోనె్మంట్‌లో శాశ్వతంగా నీటి సరాఫరా సమస్య పరిష్కరించటానికి కృషి చేస్తామనీ మంత్రులు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే జి. సాయన్న, జలమండలి ఎండి దానకిషోర్, కంటోనె్మంట్ ఇఒ యస్‌విఆర్ బాలకృష్ణ, బోర్డు పాలక మండలి వైస్ చైర్మన్ జె. రామకృష్ణ, బోర్డు సభ్యులు, బోర్డు అధికారులు పాల్గొన్నారు. సమావేశం అతంతరం డిఫెన్స్ ఎస్టేట్ కార్యాలయంలో హరితహరం మొక్కలు నాటారు.
ఆందోళనలు వద్దు.. అభివృద్ధే హద్దు

ఉప్పల్, జూలై 24: ఆందోళనలకు స్వస్తి పలికి..అభివృద్ధికి సహకరించాలని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని పర్వతాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేసి పక్కనే రూ.2.20కోట్ల వ్యయంతో నిర్మించిన 33కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ధనవంతుల్లా పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తుందన్నారు. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ పని లేని ప్రతిపక్షాలు ఇళ్ల స్థలాల పేరుతో రాద్ధాంతం చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంకు 400 ఇళ్లు మంజూరైతే మేడ్చల్‌లో 600 ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 24 గంటలూ మెరుగైన విద్యుత్ సరఫరా కోసం 180కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మించిందన్నారు.ఇంటింటికి నీరు అందించేందుకు ప్రత్యేక పైపులైన్లు వేసి కృష్ణా నీటిని సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టందన్నారు.

రైతులకు 24గంటల విద్యుత్ సరఫరాకు సిద్ధం
ఘట్‌కేసర్, జూలై 24: తెలంగాణ రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యుత్, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మైసమ్మగుట్ట కాలనీలో ఎస్సీ బాలుర కాలేజీ వసతి గృహం, సిసి రోడ్డు, గురుకుల పాఠశాల ప్రహరీ నిర్మాణాలకు రాష్ట్ర రవాణా శాఖామంత్రి పి.మహేందర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డిలతో కలిసి సోమవారం ప్రారంభించారు. రూ.2.5 కోట్ల నిధులతో నిర్మించిన ఎస్సీ బాలుర కాలేజ్ వసతి గృహన్ని ప్రారంభించిన అనంతరం స్థానికంగా రూ.10లక్షల నిధులతో బైపాసు రోడ్డు నుండి మైసమ్మగుట్ట కాలనీ వరకు నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల చుట్టూ రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన జరిపారు. మైసమ్మగుట్ట కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల కాలంలో ఆరవై సంవత్సరాల అభివృద్ధిని సాధించినట్లు చెప్పారు. అన్ని కులాలు, వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు పర్చామన్నారు. పేదింటి ఆడపిల్లలకు పెద్దన్నగా ఆదుకునేందుకు షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలను అమలు పరుస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికి ఖరీదైన విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్రంలో 103 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుస్తున్నట్లు, మహిళల కొరకు రాష్ట్రంలో ప్రత్యేకంగా 30 మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్ల మరమ్మతులకు పది వేల కోట్లను కేటాయించి అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల అమలుతో సమస్యలు లేని రాష్ట్రంగా రూపొందనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు గోదావరి జలాలను త్వరలో అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కార్యోన్ముఖులు కావాలని కోరారు. వన సంపద పెరగటం ద్వార వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని. దింతో కరువు కాటకాలు ఉండవవన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతు మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో రోడ్లు, పాఠశాలల మరమ్మతులు, కమ్యూనిటీ హళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని లక్ష్యాన్ని మించి మొక్కలు నాటినట్లు తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకం పనులు పూర్తయినట్లు తెలిపారు. మైసమ్మగుట్ట కాలనీ వద్ద మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలు మొక్కలు నాటారు.
కార్యక్రమంలో ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, కీసర ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి, డైరక్టర్లు బొక్క ప్రభాకర్‌రెడ్డి, కొంతం అంజిరెడ్డి, ఆకిటి నర్సింహారెడ్డి, ఎంపిడిఓ కల్వకుంట్ల శోభ, తహశీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, ఎంపిటిసిలు మేకల నర్సింగ్‌రావు, బేతాల నర్సింగ్‌రావు, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బైనగారి నాగరాజు, టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి కందుల కుమార్, ఎదుగని కృష్ణమూర్తి, బండారి అంజిగౌడ్, సిరాజ్, బర్ల హరిశంకర్ పాల్గొన్నారు.

హరిత తెలంగాణకు బాటలు వేద్దాం
ఉప్పల్, జూలై 24: ‘చేరుూ చేరుూ కలుపుదాం.. హరిత తెలంగాణకు బాటలు వేద్దాం’ అని బిసి సంక్షేమం, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (జిహెచ్‌ఎంసి), హైదరాబాద్ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఎ) ఆధ్వర్యంలో సోమవారం ఉప్పల్ సర్కిల్ పరిధిలో నిర్వహించిన మూడో హరితహారంలో పాల్గొని మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్లు తాడూరి శ్రీనివాస్, రాకేష్ కుమార్, భూమారెడ్డి, హెచ్‌ఎండిఎ కమిషనర్ టి.చిరంజీవులు, జోనల్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావు, కార్పొరేటర్లు అనలారెడ్డి, స్వప్న, జ్యోత్స్న, సరస్వతి, వేలాది మంది విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పెరుగుతున్న జనాభాతో విస్తరిస్తున్న కాలనీలతో పట్టణాలలో కాలుష్యం పెరిగి మానవాళి మనుగడకే ముప్పు వచ్చే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులు ధ్వంసమై భూములు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాలి, నీరు, ఆహ్లాదకరమైన పచ్చని పకృతి అందాలను అందించే అడవులను పెంచాలన్న కెసిఆర్ పిలుపు మేరకు హరితహారం ఉద్యంలా చేపట్టామన్నారు. జపాన్, ఇటలీ, చైనా, కెనడా దేశాలలో 70శాతం అడవులు ఉన్నందు వల్ల గాలి, నీరు పుష్కలంగా లభిస్తుందన్నారు. 33శాతం తెలంగాణలో అడవులు ఉండాలని అందుకే 230 కోట్ల మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ పరిధిలో 193 అటవీ ప్రాంతాలలో 24 బ్లాకులుగా విభజించి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జన్మదినం కానుకగా లక్ష మొక్కలను పెంచాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరు సామాజిక ఉద్యమంలా మొక్కలు నాటి బిడ్డలుగా పెంచి భావి తరాలకు ఫలాలను అందించాలని పిలుపునిచ్చారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు విద్యార్థులు ముందుండాలని పిలుపునిచ్చారు. గ్రీన్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో చేపట్టే హరితహారంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెచ్‌ఎండిఎ మెంబర్ ఎస్టేట్ రాజేశం, టిఆర్‌ఎస్ నేతలు, అధికారులు, విద్యాసంస్థల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

భారతీయ ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటిన సినారె
హైదరాబాద్, జూలై 24: సర్వజనులకు అర్థమయ్యేలా సాహిత్యం, కవిత్వం రాసిన డా.సి.నారాయణరెడ్డి.. విదేశాల్లో పర్యటించి తన కవిత్వం ద్వారా భారతీయ ఔన్నత్యాన్ని చాటారని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. శ్రీసాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ, కాచం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రవీంద్రభారతిలో జరిగిన డా.సి.నారాయణరెడ్డి జయంతి స్మృతి పథంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి రోశయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సాయి శయనారెడ్డి పాల్గొనగా, కాచం ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డా.కాచం సత్యనారాయణ గుప్త అధ్యక్షత వహించారు. ఏడుగురు బాలలకు సినారె బాలపురస్కారాలు, ఇరవై రెండు మంది ప్రభుత్వ పాఠశాల ప్రతిభా విద్యార్థులకు సినారె ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. పది మందికి సినారె ఆత్మీయ పురస్కారాలను అందించారు. చిన్నారుల నృత్యలు అలరించాయి. కార్యక్రమంలో ధన్వంతరి ఫౌండేషన్ చైర్మన్ డా.కమలాకర్ శర్మ, సామాజికవేత్త కొత్త కృష్ణవేణి శ్రీనివాస్, శ్రీసాయి అలేఖ్య సంస్థ వ్యవస్థాపకురాలు ఉపద్రష్ట అరుణ అశోక్ పాల్గొన్నారు.

అడ్డగోలుగా కాంట్రాక్టులు!
హైదరాబాద్, జూలై 24: కోటి మంది నగరవాసులకు పౌరసేవలను అందించే జిహెచ్‌ఎంసి రవాణా విభాగంలో అక్రమాలను అడ్డుకునేందుకు ఉన్నతాధికారులు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా, ఫలితం దక్కటం లేదు. భారీ కుంభకోణాలు వెలుగుచూడటంతో ఏడాది క్రితమే ఈ విభాగాన్ని జోన్లకు వికేంద్రీకరిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే! అయినా నేటికీ అక్రమాలు, అవకతవకలకు బ్రేక్ పడటం లేదు. ఒక్కసారి ఆదేశాలు జారీ చేసి, ఆ తర్వాత అవి క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతున్నాయన్న విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం వల్లే అక్రమార్కులైన కొందరు అధికారుల ఆగడాలు కొనసాగుతున్నాయన్న విమర్శ ఉంది. నగరంలో ప్రతిరోజు పోగయ్యే చెత్తను శివారులోని డంపింగ్ యార్డుకు తరలించే వాహనాలకు డ్రైవర్లు, కార్మికులను సమకూర్చుకునేందుకు అధికారులు ఇటీవలే చేపట్టిన టెండర్ ప్రక్రియలో భాగంగా కొందరు కాంట్రాక్టర్లకు చెందిన అర్హత లేని సంస్థలకు అడ్డదారిలో పనులు కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఒక్కో కాంట్రాక్టరు తన సామర్థ్యానికి మంచి ఎక్కువ పనులు చేజిక్కించుకుండటంతో జిహెచ్‌ఎంసిలో పనులు సకాలంలో జరగటం లేదన్న విషయాన్ని గుర్తించిన కమిషనర్ ఇటీవలే రోడ్ల మరమ్మతుల పనులకు సంబంధించి ఒక్కో కాంట్రాక్టర్‌కు కేవలం మూడు పనులు మాత్రమే కేటాయించాలన్న నిబంధనను విధించారు. కానీ రవాణా విభాగంలో ఇలాంటి నిబంధనేమీ లేకపోవటంతో చాలా కాలంగా తిష్టవేసిన కొందరు కాంట్రాక్టర్లు పని విలువకు 2.89 లెస్ వేయాల్సి ఉండగా, అంతకన్నా తక్కువ 2.68 కోట్ చేసినట్లు సమాచారం. అయితే డ్రైవర్లు, కార్మికులను కార్పొరేషన్‌కు అందించే ఈ సంస్థలు కచ్చితంగా లేబర్ లైసెన్సు, వ్యాట్ చెల్లింపులు ధ్రువీకరణ పత్రాలతో పాటు టర్నోవర్‌కు సంబంధించిన సర్ట్ఫికెట్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, తాజాగా చేపట్టిన టెండర్ల ప్రక్రియలో పైన పేర్కొన్న వాటిలో ఏమీ లేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు అధికారులు రహస్యంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అలాంటి వారికి కూడా పనులు కట్టబెట్టేందుకు రంగం సిద్దం చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ టెండర్లకు సంబంధించి టెక్నికల్ బిడ్డలను తెరిచిన అధికారులు ఒక కాంట్రాక్టర్‌కు రెండు పనులను అప్పగించాల్సి ఉన్నా, అడ్డదారిలో పది పనులను కట్టబెట్టేందుకు సిద్దమైనట్లు, ఇందుకు సంబంధించి కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య చర్చలు కూడా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం మూడేళ్ల అనుభవం కల్గి ఉండాలన్న నిబంధనను టెండర్ పత్రాల్లో పొందుపర్చిన అధికారులు టెక్నికల్ బిడ్‌లను తెరిచిన తర్వాత దాన్ని ఏడాది అనుభవం ఉంటే చాలని సడలించినట్లు తెలుస్తోంది.

ఇన్‌స్పెక్టర్ వర్సెస్ అఖిలపక్షం

సైదాబాద్, జూలై 24: మాదన్నపేట మార్కెట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకున్నాడో నాయకుడు. నాయకుడి తీరును తప్పుబట్టిన మాదన్నపేట ఇన్‌స్పెక్టర్ మందలించాడు. అవమానంగా భావించిన ఆ టిడిపి నాయకుడు.. సోమవారం అఖిలపక్ష నాయకులతో కలిసి ఠాణా ముందు ధర్నా పేరుతో హైడ్రామా చేశారు. సమర్తవంతమైన అధికారిపై ఆరోపణలు సహించలేని మార్కెట్ రైతులు, వ్యాపారులు, స్థానికులు పోటీ నిరసనకు దిగారు. పోటాపోటీ నిరసనల నినాదాలతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారితో చర్చలు జరిపారు. తప్పుడు ఆరోపణలపై నాయకులు.. పోలీసులకు క్షమాపణలు చెప్పి వెనుదిరిగారు. దక్షిణ మండల డిసిపి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మాదన్నపేట మార్కెట్‌లో చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. వర్షపు నీరు నిలిచిపోయిన మార్కెట్ అంతా బురదమయం అవుతోంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగాలేక అక్కడ రైతులు, వినియోగ దారులు అవస్థ పడుతుంటారు. దాంతో మాదన్నపేట పోలీసులు జోక్యం చేసుకొని మార్కెట్‌లోని కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, జిహెచ్‌ఎంసి అధికారుల సమన్వయంతో చందాలు సేకరించి ఆధునీకరణ పనులు ప్రారంభించారు. మాదన్నపేట మార్కెట్ భూమి పలు వివాదాల్లో ఉంది. ఆదివారం జరుగుతున్న పనుల వద్దకు టిడిపి నాయకుడు గాజుపాక జ్ఞానేశ్వర్ చేరుకొని భూమి యజమానులైన మైనారిటీలు తనకు జిపిఎ చేశారని, ఇక్కడ పనులు చేయవద్దని అడ్డుకోబోయారు. సున్నిత ప్రాంతమైన మాదన్నపేటలో అసమానతలు తేవద్దని, అభివృద్ధి పనులు అడ్డుకోవద్దని ఇన్‌స్పెక్టర్ మందలించాడు. దానిని అవమానంగా భావించిన అతను సోమవారం టిఆర్‌ఎస్, టిడిపి, బిజెపి, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఠాణా ముందు ధర్నాకు దిగాడు. విషయం తెలుసుకున్న మార్కెట్ రైతులు, స్థానికులు అక్కడికి చేరుకొని ఇన్‌స్పెక్టర్‌కు మద్దతుగా నిరసనకు దిగారు. వందల సంఖ్యలో ఇరువర్గాలు మోహరించడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే అక్కడికి దక్షిణ మండలి డిసిపి సత్యనారాయణ, అడిషనల్ డిసిపి బాబురావు చేరుకున్నారు. ఇరువర్గాల ప్రతినిధులతో పోలీస్‌స్టేషన్‌లో చర్చించారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు, అభ్యంతరకర వాఖ్యలతో ప్లకార్డులు ప్రదర్శించడంపై అసహనం వ్యక్తం చేశారు. భూ విషయమై జ్ఞానేశ్వర్ తగిన ఆధారాలను చూపించలేకపోయాడు. అసత్య ఆరోపణలపై క్షమాపణలు చెప్పి వారు వెనుదిరగడంతో పరిస్థితి చక్కబడింది. ధర్నాలో టిఆర్‌ఎస్ నాయకులు చవ్వ సతీష్‌కుమార్, కె.్భమేష్, కోట్ల శ్రీనివాస్, పొదిళ్ల శ్రీ్ధర్, మహేందర్‌యాదవ్, టిడిపి నాయకుడు రవీందర్, బిజెపి మాజీ కార్పోరేటర్ సహదేవ్‌యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొత్తకాపు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

పిడబ్ల్యుడి ఉద్యోగుల బదిలీ అన్యాయం
ఖైరతాబాద్, జూలై 24: ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పిడబ్ల్యుడి ఉద్యోగులను వివిధ ప్రాంతాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు బదిలీ చేయడం అన్యాయమని పబ్లిక్ వర్క్‌షాప్ (ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్) ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఖైరతాబాద్ మింట్‌కాంపౌండ్‌లోని కర్మాగారంలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ శాఖ మాజీ కార్యదర్శి సోహన్‌లాల్ జైశ్వాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడతాయని భావిస్తే ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన నిజాం నవాబు ఏర్పాటుచేసిన ఈ కర్మాగారంలో సుమారు మూడు వేల మంది ఉద్యోగులు పనిచేసే వారని అన్నారు. మందుగుండు సామాగ్రి, ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్లు తయారుచేసే వారని అన్నారు. ఏళ్ల తరబడి కర్మాగారాన్ని అభివృద్ధి చేయకుండా తమ కర్మాగారంలో జరిగే పనులను కాంట్రాక్టులకు అప్పగిస్తుండటంతో ఇక్కడ పనిలేకుండా పోయిందని అన్నారు. ఎంతో అద్భుతమైన యంత్రాలు కలిగిన ఈ కర్మాగారాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం.. పనిలేదన్న సాకుతో ఉద్యోగులను ఇరిగేషన్ ప్రాజెక్టులకు బదిలీ చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. బదిలీలపై ఉన్నతాధికారులను కలిస్తే తమ చేతుల్లో ఏమి లేదని మంత్రిని కలవాలని సూచించారని అన్నారు. గతంలో కార్మిక సంఘం అధ్యక్షునిగా పనిచేసిన మంత్రి పద్మారావు వద్దకు వెళ్లగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలను తీసుకోకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. ఈ అంశంపై త్వరలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ, బీంరావు, పరమేశ్వర్, వేణుగోపాల్ పాల్గొన్నారు.

ఆందోళనలతో అట్టుడికిన జంట పురపాలక సంఘాలు
ఉప్పల్, జూలై 24: జంట పురపాలక సంఘాలైన బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాలు అరెస్టులు, దిష్టిబొమ్మ దగ్ధం, రాస్తారోకో, ఆందోళనలతో అట్టుడుగుతున్నాయి. పర్వతాపూర్ పరిసర ప్రాంతాలు పోలీసు బలగాల మధ్య బంధీ అయ్యాయి. పర్వతాపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం నిర్వహించ తలపెట్టిన భూమి పూజ, విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం అరెస్టులు, ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. సర్వే నెంబర్ 1, 11, 12లోని సీలింగ్ భూముల్లో కబ్జాలో ఉన్న పేదల స్థలాలను బలవంతంగా లాక్కొని చెత్త డంపింగ్ యార్డ్, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బాధిత మహిళలు 15 రోజులుగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. రోజురోజుకూ ఉద్ధృతమైన ఆందోళనకు ప్రతిపక్ష టిడిపి, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, సిపిఐ, ప్రజాసంఘాలు మద్దతు పెరుగుతోంది. న్యాయమైన డిమాండ్‌లను సాధించుకునేవంత వరకూ ఉద్యమాలు ఆపేదిలేదని, ఆందోళనకారులకు అండగా ఉంటామని ప్రతిపక్షాల ముఖ్య నేతలు ధైర్యం చెప్పారు. రాజకీయ పెద్దల కబ్జాల కబంధ హస్తాల్లో చిక్కుకున్న విలువైన భూములను స్వాధీనం చేసుకోవాలని, అందులోనే డబుల్ బెడ్‌రూం ఇళ్లు, చెత్త డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేసి ఎన్నో ఏళ్లుగా బీస్మెట్‌తో కబ్జాలో ఉన్న ఖాళీగా ఉన్న పదెకరాల భూములను వదిలేయాలని బాధిత మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఆదివారం పర్వతాపూర్‌ను సందర్శించిన టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే కబ్జాలు, ప్రజావ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తి కడిగిపారేశారు. న్యాయమైన డిమాండ్ సాధన కోసం అండగా ఉంటామని, భూపోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి మాటలు దుమారం లేపాయి.
ఇళ్లపై దాడులు, నేతల అరెస్టులు
పర్వతాపూర్‌లోని ఆందోళన చేపట్టిన స్థలంలోనే డబుల్ బెడ్‌రూం ఇళ్లు శంకుస్థాపన, విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి సోమవారం వచ్చే మంత్రుల రాక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆందోళనకారులు కార్యక్రమాన్ని అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు ఆదివారం అర్ధరాత్రి పరిసర ప్రాంతాలలోని పర్వతాపూర్, మేడిపల్లి, పీర్జాదిగూడ, బోడుప్పల్, కాచవానిసింగారం ప్రాంతాలలో ఉంటున్న టిడిపి, బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఐద్వా ముఖ్య నేతలను అరెస్టు చేసి ఇతర పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో టిడిపి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర జంగయ్య, బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాపోలు రాములు, పర్వతాపూర్ మాజీ సర్పంచ్ దేశగోని రఘుపతి గౌడ్, తెలుగు యువత అధ్యక్షుడు దేశగోని శ్రీకాంత్ గౌడ్, పార్టీ నేతలు నర్సింహ, జలంధర్‌రెడ్డి, బిజెపి నాయకులు పి.మోహన్‌రెడ్డి, దుబ్బాక విష్ణువర్ధన్ రెడ్డి, పీర్జాదిగూడ పురపాలక సంఘం అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, ఐద్వా నాయకురాలు సృజన, ఇతర నాయకులను పోలీసులు మందస్తుగా అరెస్టు చేశారు.