క్రీడాభూమి

ఎక్కువ టెస్టులు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎక్కువ సంఖ్యలో టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం ఉందని, అప్పుడే క్రికెటర్లలో ప్రమాణాలు పెరుగుతాయని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. గురువారం ఇక్కడ జరిగిన సన్మాన కార్యక్రమానికి హారజైన ఆమె మాట్లాడుతూ వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో భారత్ గొప్పగా రాణిస్తున్నదని అన్నది. అయితే, టెస్టుల్లో ఎక్కువ ఆడిస్తేనే అంతర్జాతీయ క్రికెట్‌కు మన దేశం అత్యుత్తమ మహిళా క్రికెటర్లను అందించగలుగుతుందని తెలిపింది. మిథాలీ 18 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు కేవలం పది టెస్టులు మాత్రమే ఆడింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమేగాక, వరల్డ్ కప్‌లో ఆడిన మహిళా క్రికెటర్లకు తలా 50 లక్షల రూపాయల చెక్కులను బహూకరించింది. ఈసారి మహిళల వరల్డ్ కప్ టోర్నీకి మీడియా ప్రాధాన్యతనిచ్చిందని, అందుకే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు భారీ స్పందన కనిపిస్తున్నదని మిథాలీ పేర్కొంది. టెస్టు క్రికెట్ ఆడితేనే అన్ని విభాగాల్లోనూ నైపుణ్యం బయటపడుతుందని తెలిపింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య యాషెస్ సిరీస్ క్రమం తప్పకుండా జరుగుతుందని గుర్తుచేస్తూ, అదే స్థాయిలో మిగతా దేశాలు కూడా టెస్టు సిరీస్‌లను ఆడాల్సిన అవసరం ఉందని చెప్పింది. గత ఐదేళ్ల కాలంలో తమకు కేవలం 10 టెస్టులు మాత్రమే ఆడే అవకాశం దక్కిందని మిథాలీ వాపోయింది. టెస్టు క్రికెట్ అన్ని ఫార్మాట్స్‌కు మాతృక అనే విషయాన్ని మరచిపోరాదని పిలుపునిచ్చింది. దేశంలో మహిళా క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పింది.