ఖమ్మం

హరితహారం లక్ష్యం దిశగా అటవీశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు: హరితహారం మూడవ విడత కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు అటవీ రేంజి పరిధిలో మొక్కలను నాటేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించేందుకు అటవీశాఖ కృషి చేస్తోంది. హరితహారం పథకం కోసం అటవీశాఖ ఆధ్వర్యంలోనే మండల పరిధిలోని గుండెపుడి, జూలూరుపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను పెంచారు. హరితహారం కార్యక్రమం ప్రారంభంతోనే ఆశాఖ అధికారులు ప్రణాళికతో ముందుకు సాగటంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. అటవీ రేంజి పరిధిలోని జూలూరుపాడు, పాపకొల్లు, గుండెపుడి సెక్షన్‌లు, పాపకొల్లు 1-2, బేతాళపాడు, నల్లబండబోడు, గుండెపుడి, నాచారం బీట్‌లలోని అటవీ ప్రాంతాల్లో మొక్కలను నాటారు. ఇంతే కాకుండా కొత్తగా 20 హెక్టార్లలో ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేసి పలు రకాల అడవి జాతి మొక్కలను నాటించారు. పాపకొల్లు అటవీ ప్రాంతంలో అడవుల సంరక్షణలో భాగంగా అటవీ ప్రాంత సరిహద్దుల చుట్టూ తవ్విన కందకాల గట్లపై 10 కిలోమీటర్ల మేర బండ్ ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కొత్తగా అటవీశాఖ ప్రవేశపెట్టిన సీడ్ బాల్ టెక్నాలజీ ద్వారా సూరారం, నల్లబండబోడు, పాపకొల్లు అటవీ ప్రాంతాల్లో అడవిజాతికి చెందిన పలు రకాల చెట్లకు చెందిన విత్తనాలను వెదజల్లారు. ఇంతే కాకుండా రెండు విడతలుగా ఇప్పటి వరకు సాగిన హరితహారం కార్యక్రమాల్లో నాటిన మొక్కలు దెబ్బతినటంతో వాటి స్థానాల్లో కూడా ఆయా ప్రాంతాలకు చెందిన అధికారులు ప్రస్తుతం మొక్కలను నాటించే పనిలో పడ్డారు. మండలంలో పలుశాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాల్లో కూడా అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు భాగస్వాములవుతున్నారు. జూలూరుపాడు రేంజర్ నాగసాయి ప్రసాద్, డిఆర్వో బాలరాజు, సెక్షన్ అధికారులు రాజేష్, సత్యం, బీట్ ఆఫీసర్‌లు రాధ, రాంబాబు, విజయ్, సూరిబాబు, సిబ్బంది తాటి రాములు, వెంకన్న పలువురు ప్రజా భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా డిఆర్వో బాలరాజు మాట్లాడుతూ ఇప్పటికే 40వేల మొక్కలు నాటించాం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పెరుగుతున్న లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.