హైదరాబాద్

జిహెచ్‌ఎంసి సామాజిక కార్యక్రమాలకు ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహిళా సాధికారత తదితరంశాలపై అధ్యయనం చేస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 20 మంది ప్రతినిధుల బృందం గురువారం జిహెచ్‌ఎంసిని సందర్శించింది. జిహెచ్‌ఎంసి అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులపై అధ్యయనం చేసేందుకు వచ్చిన ఈ బృందం అదనపు కమిషనర్ భాస్కరాచారిని అధికారికంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా కార్పొరేషన్ పరిపాలన వ్యవహారాలతో పాటు అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించే పాలక మండలి సమావేశాల నిర్వహణ, మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్ల అధికారాలు వంటి అంశాలను వివరించారు. జిహెచ్‌ఎంసి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాలు, వాటికి బ్యాంకులతో ఇప్పిస్తున్న రుణాలు, ఆసరా స్కీం, స్వచ్చ రిసోర్సు పర్సన్లు,వీది వ్యాపారుల పాలసీ, ఆకలితో అలమటించే వారికి కేవలం ఐదు రూపాయలకే భోజనాన్ని అందించే అన్నపూర్ణ స్కీం, మహిళా ఆరోగ్యంపై అమలు చేస్తున్న ఆరోగ్య సమితి తదితర కార్యక్రమాల గురించి ఆయన బృందానికి వివరించారు. నగరంలోని పౌరులకు అవసరమైన పౌర సేవలను అందించటంతో పాటు దానికి సమాంతరంగా అభివృద్ధి పనులు చేపడుతూనే మరో వైపు వయోవృద్ధులకు కూడా ఆసరా పథకంతో జిహెచ్‌ఎంసి అండగా నిలవటం పట్ల బృందం అభినందించింది. అలాగే వికాసం కార్యక్రమం ద్వారా వికలాంగులకు కూడా చేయూతనివ్వటాన్ని ప్రశంసించింది. అలాగే వివిధ కారణాలతో నగరానికి వచ్చి ఇక్కడే ఉండిపోయిన నిరాశ్రయులకు రాత్రిపూడ ఆశ్రయం కల్పించేందుకు అమలు చేస్తున్న నైట్ షెల్టర్ల కార్యక్రమం, దాని నిర్వహణను కూడా ఆయన బృందానికి వివరించారు. అలాగే లింగమార్పిడి చేసుకున్న వారికోసం ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా? అన్న విషయాన్ని బృందం అడిగి తెల్సుకుంది. ఇప్పటికే వయోవృద్దులు, వికలాంగుల సహాయం కోసం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్న జిహెచ్‌ఎంసి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు, నియమనిబంధనల కోసం వేచి ఉన్నట్లు తెలిపారు.

జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించాలి
హైదరాబాద్: ప్రస్తుత సమావేశాల్లోనే జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగ బద్దత కల్పించే బిల్లును ఆమోదించాలని తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. రాజ్యసభలో బిల్లు ఆమోదింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు శ్రీనివాస్‌గౌడ్ వినతిపత్రం సమర్పించారు. బిసిలకు రాజకీయంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 32 రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. కేంద్రంలో ప్రత్యేకించి బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్రీయ విద్యా సంస్థల్లో చదువుతున్న బిసి విద్యార్థులకు పూర్తిగా ఫీజులు కేంద్రమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో బిసిల సంక్షేమానికి ప్రతి ఏటా లక్ష కోట్లు కేటాయించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.

పోలీసు పహారాలో ఉద్యాన విశ్వవిద్యాలయం

రాజేంద్రనగర్:ఉద్యాన విస్తరణ అధికారుల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రోజుకో విధంగా విద్యార్థులు తమ ఆందోళనను ఉధృతం చేస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. విద్యార్థులు చేపట్టిన ఆందోళన 25వ రోజుకు చేరింది. గురువారం ఉదయానే్న భారీ ఎత్తున పోలీసు బలగాలు ఉద్యాన విశ్వవిద్యాలయం వర్సిటిని చుట్టుముట్టారు. హాస్టల్‌లను పోలీసులు స్వాధీనం చేసుకొని విద్యార్థులను బయటకు లాగి పడేసి గేట్‌లకు తాళాలు వేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు పెద్ద ఎత్తున హాస్టల్ భవనం ముందు బైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ వనజాలత కార్యాలయం నుంచి బయటకు రాకుండా విద్యార్థులు అడ్డు కూర్చొన్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎట్టిపరిస్థితుల్లో క్యాంపస్‌ను వదిలిపోయే ప్రసక్తే లేదని, హాస్టల్‌కు వేసిన తాళాలు తెరిపించే వరకు కార్యాలయాన్ని వీడేది లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా అదనపు బలగాలను యూనివర్సిటికి రప్పించి పహారా కాస్తున్నారు. పోలీసులు విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పొద్దు పోయే వరకు వేచి చూసి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఏ క్షణం ఏం అవుతుందోనని ఉత్కంఠత నెలకొంది. విద్యార్థులు సైతం ప్రాణాలు పోయినా పర్వాలేదని, యూనివర్సిటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భీష్మించారు. పోలీసులు భవంతులను తమ ఆధీనంలోకి తీసుకొని తాళాలు వేశారు. ఆందోళనలో ప్రశాంత్, ప్రకాష్, జీవన్‌జ్యోతి, అనిత, షర్మిల, పృద్వీ తదితరులు ఉన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
ఉప్పల్: ఆర్ధిక ఇబ్బందులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ ఆదర్శనగర్‌లోని శ్రీ నివాస్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నెంబర్ 315లో నివసిస్తున్న గణేష్ మండవ (32) జెన్‌ప్యాక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవలనే బెంగళూరు నుంచి భార్య అనురాధ, ఆరు నెలల కుమార్తెతో హైదరాబాద్‌కు వచ్చిన అతడు ఆర్ధిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నాడు. అప్పులు చేసి సకాలంలో తీర్చలేక మనస్థాపంతో బుధవారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

3.95కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
గచ్చిబౌలి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3కోట్ల 95లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన హరితహారం కార్యక్రమానికి మంత్రి ముఖ్యతిధిగా విచ్చేసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ కోటి, రంగారెడ్డిలో కోటి 70లక్షలు వికారాబాద్ జిల్లాలల్లో కోటి 25లక్షల మొక్లను 3వ విడిత హరితహారంలో నాటుతున్నామని ఆయన తెలిపారు. ఈకార్యమ్రంలో గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబాతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యయులు సుభాన్‌రెడ్డి, రాజేందర్‌తో పాటు టిఆర్‌ఎస్ నాయకులు వార్డు మెంబర్లు ఉపాధ్యయులు విద్యార్ధులు పాల్గొన్నారు.

నోట్ల మార్పిడికి యత్నించిన వ్యక్తుల అరెస్టు
ఖైరతాబాద్: రద్దయన నోట్లను మార్పిడి చేసేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులు పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు వివరాల ప్రకారం.... మెహిదీపట్నం దిల్‌షాద్‌నగర్ కాలనీ దస్తగిరివిల్లాలో నివాసం ఉండే సలీమ్ (38) జైళ్లశాఖలో కరాటే ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అతని వద్ద కోటి 20లక్షల రద్దయన 500, వెయ్య నోట్లను మార్పిడి చేసేందుకు హుమాయన్‌నగర్ విజయానగర్ నివాసం ఉండే అతని స్నేహితుడు మహ్మద్ అలీమ్ (55)ను సంప్రదించాడు. అతను తెలిపిన మధ్యవర్తి కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో ఉంటున్న సుబ్బారెడ్డిని కలవాలని తెలిపాడు. అతని సూచనల మేరకు సుబ్బారెడ్డిని సంప్రదించాడు. సుబ్బారెడ్డి నోట్లను తీసుకొని పంజాగుట్టలోని జివికె వద్దకు రావాలని సూచించాడు. దీంతో నోట్లను పట్టుకొని బుధవారం రాత్రి వచ్చారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద ఉన్న కోటి 20 లక్షలను పాత నోట్లను, మూడు సెల్‌ఫోన్లు, సలీమ్‌కు చెందిన వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

అభివృద్ధి పనులను తనిఖీ చేసిన కమిషనర్
హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు కమిషనర్ జనార్దన్ రెడ్డి గురువారం తనిఖీ చేశారు. వచ్చే నెల 15వ తేదీలోపు నగరాన్ని బహిరంగ మల,మూత్ర రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు గడువు దగ్గరపడుతుండటంతో ఆయన టాయిలెట్ల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఎరుకల నాంచారమ్మ బస్తీలోని కమ్యూనిటీ టాయిలెట్లతో పాటు అక్కడే నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత దిల్‌సుఖ్‌నగర్‌లోని మెట్రో స్టేషన్ సమీపంలో పూర్తిగా గుంతలమయమైన రోడ్లను పరిశీలించిన కమిషనర్ ఈ రోడ్డు ఎక్కడెక్కడ గుంతలమయంగా మారిందన్న వివరాలతో మెట్రోరైలు ఎండికి సమగ్రంగా లేఖ రాయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత బండ్లగూడలోని పల్లె చెరువుపై నిర్మిస్తున్న వంతెన, రాజేంద్రనగర్ సర్కిల్‌లోని కాటేదాన్‌లో నిర్మిస్తున్న స్టేడియం పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పనులపై ఇంజనీర్లు, స్థానిక అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అలాగే జిహెచ్‌ఎంసిలో కమిషనర్ మొదలుకుని కార్మికుడి వరకు ఒకే డ్రస్ ఉండాలన్న నిబంధనతో అమలు చేస్తున్న డ్రెస్ కోడ్ పూర్తి స్థాయిలో ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెంటనే క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సీనియర్ అధికారులకు ఈ జాకెట్‌లను కేటాయించాలని ఆదేశించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసిలోని అన్ని విభాగాలకు చెంది క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించే కార్మికుడి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఈ డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

దర్జాగా భూముల కబ్జా
ఉప్పల్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పరిధిలోని జంట పురపాలక సంఘాలైన బోడుప్పల్, పీర్జాదిగూడలో దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. రెవెన్యూ అధికారులు, సిబ్బంది అండదండలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాచేసి అమ్ముకుంటున్నారని మేడిపల్లి మండల ప్రభుత్వ సర్వేయర్ కె.కృష్ణ ఆరోపించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పక్కనే ఉన్న పట్టా సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటూ అక్రమ లేఔట్లు చేస్తూ ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే గత పంచాయతీ కార్యదర్శి నుంచి జారీ అయిన అనుమతులతో ఇళ్ల నిర్మాణాలు (విల్లాసు) చేపట్టారని పేర్కొన్నారు. మండలంలోని బోడుప్పల్ పట్టణంలో వక్ఫ్‌బోర్డు, పోరంబోక్, ఎండోమెంట్, సీలింగ్, ఇనామ్ భూములు కాకుండానే ప్రభుత్వ భూములు బంచరాయి, పోరంబోకు మొత్తం ఆరువందల ఎకరాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో సర్వే నెంబర్ 215 బంచరాయి పోరంబోకు (అసలు శేత్వార్) ప్రకారం (36-32) ఎకరాలు, సర్వే నెంబర్ 216 నుంచి 221 వరకు చెరువు శిఖం 23.17 ఎకరాల రాచెరువు డీమార్కేషన్ చేయగా ఆ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 215లో పూర్తిగా కబ్జా చేసి ప్రైవేటు వ్యక్తులు విల్లాలు నిర్మించారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 216లోని చెరువు శిఖంలో కూడా ఇంటి నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. కబ్జాలపై పూర్తి సమాచారంతో సర్వే స్కెచ్‌తో తహశీల్దార్, అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్‌కు అసలు శేత్వారు జిరాక్స్ పత్రాలతో సమర్పించినట్లు వివరించారు. కబ్జాలపై ఇప్పటి వరకు ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసిన భూబకాసులపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని బట్టి గమనిస్తే భూబకాసురులతో అధికారులు కుమ్ముక్కైనట్లు అనుమానం వ్యక్తమవుతుందన్నారు. పీర్జాదిగూడ పట్టణంలోని సర్వే నెంబర్ 193లో గల పులిచెరువు కుంట 4-27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఇందులో 30గుంటలు శ్మశాన వాటికకు కేటాయించగా మిగతా భూమిని డీమార్కింగ్ చేయగా ఇందులో సుమారు ఎకరం భూమిని పక్క సర్వే నెంబర్లలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన భూబకాసురులు ఇట్టి కుంటను యదేచ్ఛగా కబ్జాచేసి ఇంటి నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం చెరువులు, కుంటలు, శిఖంలో ఉన్న దగ్గర ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) తర్వాత భఫర్ జోన్ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, కానీ ఇక్కడ కుంటనే ఆక్రమించుకుని అందులోనే విల్లాలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విదంగా మేడిపల్లిలో సర్వే నెంబర్ 62 ప్రభుత్వ భూమిలో కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయన్నారు. భూమి కొంటున్న వ్యక్తులకు కబ్జాదారులు ప్రదేశం మీద ప్రభుత్వ భూమిని చూపించి పక్కనే ఉన్న ప్రైవేటు పట్టా సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలిపారు. చెంగిచర్లలో ఉన్న చెరువుల శిఖం భూములు ఎఫ్‌టిఎల్‌లో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పర్వతాపూర్‌లో సాలార్‌జంగ్ కంచెలో సర్వే నెంబర్ 1 నుంచి 21 వరకు మొత్తం 362 ఎకరాలు ఉండగా 38 ఎకరాల 28 గుంటల సీలింగ్ భూములు ఉన్నాయని, ఇందులో సర్వే నెంబర్ 1, 10, 11లో మొత్తం సీలింగ్ భూములు కబ్జా కాగా కేవలం రెండెకరాలు మాత్రమే మిగిలి ఉందన్నారు. భూ బకాసురులు ప్రైవేటు పట్టా సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను అక్రమ లేఔట్లతో ప్లాట్లుగా మార్చి అమాయక పేదలకు అమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురయ్యాయని తాను చేపట్టిన సర్వే నివేదికలో వెల్లడైందని సర్వేయర్ కృష్ణ పేర్కొన్నారు. మండలం పరిధిలో అగ్రికల్చర్ జోన్‌ను నాన్ అగ్రికల్చర్ కింద మార్చేందుకు సర్వేయర్ నివేదిక లేకుండానే కింది స్థాయి సిబ్బందితో కలిసి తహశీల్దార్ ఎన్‌ఓసి జారీ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై విచారణ జరిపి భూబకాసురులు, సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్, అవినీతి నిరోధక శాఖ సంచాలకులు, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు.
తహశీల్దార్ వివరణ
మండలం పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువు, కుంటలు అన్యాక్రాంతం అవుతున్నాయని స్వయంగా సర్వేయర్ కృష్ణ చేసిన ఆరోపణలపై తహశీల్దార్ సంతోష్‌లాల్ వివరణ ఇచ్చారు. తన హయాంలో కబ్జాలు కాలేదని, ఇప్పటికీ అవుతున్నట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. భూముల కబ్జాల వెనుక అధికారుల అండదండలు ఉన్నాయని సర్వేయర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు.
తెరాస నేతలపై కేసుల ఎత్తివేత సరికాదు
ఖైరతాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార పార్టీ నేతలపై ఉన్న కేసులను ఎత్తివేయడం సరికాదని మాజీ న్యాయమూర్తి లక్ష్మణ రెడ్డి అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాజీ సమాచార కమిషనర్ విజయ్‌బాబు, వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. తీవ్ర నేరాలకు పాల్పడిన ఆరోపణల్లో ఉన్న మంత్రులు, స్పీకర్, ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ పలు జీఓలను తీసుకురావడం, కేసులు ఎత్తివేయడం న్యాయవ్యవస్థను అపహాస్యం చేసినట్టేనని అన్నారు. ప్రజా సమస్యల కోసం జరిగిన ఉద్యమాలలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయడం కోసం కల్పించిన వెసులుబాటును అధికారంలో ఉన్న వారు ఇలా దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం సహించే అంశం కాదని అన్నారు. ఇదే కొనసాగితే సమాజంలో తీవ్ర నేరాలకు పాల్పడిన వారు అధికార పార్టీకి వెళ్లి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారని అన్నారు. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన స్పీకర్ పదవికి అనర్హుడు అంటూ జాతీయ స్థాయిలో చర్చ జరిగినా తెలుగు రాష్ట్రాల్లో స్పందన రాకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రాలకు ఉన్న ఈ అధికారాలను దుర్వినియోగం అవుతున్నందున దీనిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్టు చెప్పారు. ఏపి ప్రభుత్వం జూన్ నుంచి ఎంతమందిపై కేసులు ఎత్తివేశారో శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ జీవోలను ఉప సంహరించుకోవాలని లేనిపక్షంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
పెరిఫెరాల్ ఆర్టీరియల్ వ్యాధితో జాగ్రత్త
హైదరాబాద్: ప్రజలలో పెరిఫెరాల్ ఆర్టీరియల్ వ్యాధి సోకకుండా అప్రమత్తంగా వుండాలని మాక్స్‌క్యూర్ హాస్పటల్ వైద్యులు సూచించారు కాళ్లలో మంటలు, జలదరింపులు వున్నట్టు అనిపించినా, కొంత దూరం నడవగానే కాళ్లు నొప్పులు వచ్చినా, అల్సరేషన్, శరీరం నల్లబడడం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించి కాళ్లకు సంబంధించిన పరీక్షలు చేసుకోవాలని అన్నారు. డాక్టర్ పంకజ్ జరివాలా, డా.ముఖీత్‌లు మీడియాతో మాట్లాడుతూ 68 సంవత్సరాల వయసున్న నవీన్ షా, 61 సంవత్సరాల రామారావును పరీక్ష చేసి ఎడమ కాలు నల్లబడడం గమనించి అనేక హాస్పటల్స్ తిరిగి వైద్యం అందుకున్నారు కానీ ఫలితం కనపడడం లేదని, గుండె జబ్బు, మధుమేహం కూడా వున్నాయని డాక్టర్లు గుర్తించి యాంజియో ప్లాస్టీని చేసారు. ప్రస్తుతం వారు ట్రీట్‌మెంట్లో వున్నారని డా.ముఖీత్ చెప్పారు. రామారావు అనేరోగి గతంలో వెళ్లిన ప్రతి హాస్పటల్‌లోను కాళ్లు తీసివేయాలని చెప్పారు కానీ తాము కాలి వేలు మాత్రమే తొలగించి పాదంతో సహా కాలుమొత్తం కాపాడగలిగామని చెప్పారు. నవీన్ పరిస్థితిని గమనిస్తు రక్తనాళాలను విశాలం చేసి మందులు వాడి రక్త ప్రసరణ మెరుగుపరిచాం, రెగ్యులర్‌గా డ్రసింగ్‌తో గాయం తగ్గేలా చేసామని డాక్టర్లు చెప్పారు. వ్యాధిని గుర్తించి సరైన సమయంలో చికిత్స పొందాలని డా.పంకజ్, డా.ముఖీత్‌లు సూచించారు.

సందేశాత్మక చిత్రాలను నిర్మించాలి
కాచిగూడ: నవ సమాజ నిర్మాణం కోసం దర్శక, నిర్మాతలు మంచి సందేశాత్మక చిత్రాలను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి సూచించారు. సినారె 87వ జయంతి సందర్భంగా జివిఆర్ ఆరాధన - డా.సినారె టివి అవార్డ్సు ప్రదానోత్సవ కార్యక్రమం జివిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.ఎ.చక్రపాణి.. వివిధ రంగాల్లో వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాహిత్యంలో శిఖరాయమానుడైన సినారె పేరిట తెలుగు టివి చానల్స్‌లోని ఎంపిక చేసిన ఉత్తమ యాంకర్లకు అవార్డ్సు బహూకరించడం ఎంతో అభినందనీయమని అన్నారు. సినారె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి అని కొనియాడారు. జివిఆర్ ఆరాధన - సినారె టివి అవార్డులను వివిధ తెలుగు చానల్స్‌లోని ఉత్తమ సీరియల్ నిర్మాత, దర్శకుడు, కథానాయకుడు, విలక్షణ నటులుతో పాటు జీవిత సాఫల్య పురస్కారాన్ని నిర్మాత, దర్శకుడు డి.సురేష్‌బాబు, అకాశావాణి ప్రయోక్త ఝాన్సీ కెవి.కుమారి, న్యూస్‌రీడర్ కళ్యాణికి బహూకరించి సత్కరించారు. సభకు ముందు నాట్య గురువు ఇందిరా పరాశరం శిష్యబృందం కూచిపూడి నృత్యాంశాలు ప్రదర్శించారు. కళాపోషకులు డా.చిల్లా రాజశేఖర్‌రెడ్డి, వై.్ధనలక్ష్మి, సంస్థ చైర్మన్ గుదిబండి వెంకటరెడ్డి, వివి.రాఘవరెడ్డి పాల్గొన్నారు.