హైదరాబాద్

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో టాస్క్ఫోర్స్ పోలీసులు నగరంలోని పలు గెస్ట్‌హౌస్‌లపై దాడులు నిర్వహించారు. గెస్ట్‌హౌస్‌లలో మాదకద్రవ్యాలు, గంజాయి వంటి మత్తుపదార్థాల నిల్వలున్నాయని సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రధానంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లోని గెస్ట్‌హౌస్‌లపై టాస్క్ఫోర్స్ దృష్టిసారించింది. మొత్తం 34 గెస్ట్‌హౌస్‌లలో తనిఖీలు నిర్వహించి, 17 గెస్ట్‌హౌస్‌లపై కేసులు నమోదు చేసినట్టు టాస్క్ఫోర్స్ డిసిపి వై లింబారెడ్డి తెలిపారు. గెస్ట్‌హౌస్‌లకు వచ్చే వారికి ఎలాంటి గుర్తింపు లేకుండా, రిజిస్టర్‌లో వారి వివరాలు నమోదు చేయకపోవడం, మద్యసేవనం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం వంటి వాటి గెస్ట్‌హౌస్‌లపై కేసులు పెట్టామన్నారు. బంజారాహిల్స్‌లోని హ్యాపి గెస్ట్‌హౌస్, ఎస్‌ఎల్‌ఎన్ గెస్ట్‌హౌస్, ‘వి’హోటల్, శ్రీబాలాజీ భవన్, రాఘవ గెస్ట్‌హౌస్, జెన్ ఎక్స్ హోటల్, గెస్ట్ ఇన్ సూట్, స్టైల్ సర్వీసెస్, జూబ్లిహిల్స్‌లోని గెట్‌వెల్ హౌస్, సాయి గెస్ట్‌హౌస్, కొసరాజు గెస్ట్‌హౌస్ క్యూ హోమ్ గెస్ట్‌హౌస్, ఫెల్కాన్ గెస్టహౌస్, లక్ష్మిక్యాసిల్, హాల్‌మార్క్ ఫ్యాబ్‌టెక్ గెస్ట్‌హౌస్‌లపై కేసులు నమోదైనట్టు డిసిపి లింబారెడ్డి పేర్కొన్నారు.