హైదరాబాద్

బల్దియాలో చిత్రం.. భ ళారే విచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కోటి మంది జనాభాకు పౌరసేవలందించే జిహెచ్‌ఎంసి కార్యకలాపాలు, పరిపాలన వ్యవహారాల్లో గత కొద్ది రోజులుగా స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం హరితహారం కార్యక్రమ హడావుడి తప్ప, మిగిలిన సందడేమీ కన్పించకపోయినా, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శ వెల్లువెత్తుతోంది. గ్రేటర్ పరిధిలో రొటీన్ మెయింటనెన్స్ పనుల మినహా ఒకటి రెండు చోట్ల ఎస్‌ఆర్‌డిపి పనులు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు మినహా పెద్దగా చెప్పుకునే పనులేమీ జరగటం లేదు. అయినా రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ప్రజల ఫిర్యాదులు, వినతులను పరిశీలించేందుకు కనీసం గంట సమయమైనా కేటాయించటంలో అధికారులు విఫలమవుతున్నారు. గతంలో మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో సర్కిల్, జోనల్ స్థాయిలతో పాటు ప్రధాన కార్యాలయంలోనూ ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలంటూ ఖచ్చితమైన నిబంధనలుండేవి. అయినా ప్రధాన కార్యాలయానికి వివిధ రకాల పనులపై ప్రతిరోజు వెయ్యి నుంచి 1200 మంది వరకు సందర్శకులు వచ్చే వారు. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, సిటీ చీఫ్ ప్లానర్‌తో పాటు ఇతర అదనపు కమిషనర్ల వద్దకు సందర్శకులు, జిహెచ్‌ఎంసి ఉద్యోగులు సైతం వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకునే వారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కన్పించటం లేదు. హరితహారం కార్యక్రమం ప్రారంభమైన ఈ నెల 12వ తేదీ నుంచి మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ నగరంలో ఎక్కడో ఓ చోట జరిగే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. ఆ కార్యక్రమం ముగించుకుని వచ్చే సరికి మధ్యాహ్నామవుతోంది. ఇంకేముందీ భోజన విరామం, ఆ తర్వాత యదావిధిగా సచివాలయం, ఇతర శాఖలకు చెందిన అధికారులతో సమీక్షలు, పర్యటనలు, చర్చలు అంటూ కమిషనర్, అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్లు సైతం బిజీగా ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ల చాంబర్లకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ల నుంచి, అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన సందర్శకులు సైతం వారి చాంబర్లలో పడిగాపులు కాసి వెళ్తున్నారు. కమిషనర్ కన్నా కింది స్థాయి అధికారులైన అదనపు కమిషనర్ల పరిస్థితి మాత్రం ఇష్టారాజ్యంగా మారుతోంది. ఏ విభాగానికి చెందిన అదనపు కమిషనర్ ఎపుడు వస్తారో, ఎపుడు బయటకెళ్తారో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మరికొందరు విభాగాలకు చెందిన అధికారుల పరిస్థితి విచిత్రంగా తయారైంది. ఒకరు ఉదయానే్న వచ్చి మధ్యాహ్నం వరకు విధులు నిర్వర్తించి వెళ్లిపోతుండగా, మరికొందరు సాయంత్రం అయిదు గంటల తర్వాత చాంబర్‌కు మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. సందర్శకులకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన, జవాబుదారితనం తగ్గుతుండటంతో రోజురోజుకి సందర్శకుల సంఖ్య తగ్గిపోతోంది. గతంలో మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల మధ్య వెయ్యి నుంచి 1200 మంది సందర్శకులు వస్తుండేవారు. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 400 నుంచి ఐదు వందలకు తగ్గినట్లు అంచనా. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాము పనిచేసేది ప్రజల కోసమేనన్న విషయాన్ని గుర్తించి, ఓ నిర్ణీత సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మీరు కాల్ చేసిన వినియోగదారుడు స్పందించటం లేదు
భవన నిర్మాణ అనుమతులు, బర్త్‌డెత్ సర్ట్ఫికెట్లు, ట్యాక్సు, స్థల సేకరణ నష్టపరిహారం, హెల్త్,శానిటేషన్ సంబంధిత, అక్రమ నిర్మాణాలు, వౌలిక వసతులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులతో ఎలాగో ప్రధాన కార్యాలయానికి వచ్చామంటూ, అధికారులు ఏదైనా పనిలో బిజీగా ఉండి ఉంటారని, వారు ఆఫీసుకు వస్తున్నారా?లేదా? అన్న సమాచారం తెల్సుకునేందుకు కార్పొరేషన్ వారికిచ్చిన ఫోన్లకు కాల్ చేస్తే వీటిలో ఎక్కువ ఫోన్లకు అటువైపు నుంచి స్పందనే ఉండదు. మీరు ప్రయత్నించిన వినియోగదారుడు స్పందించటం లేదు..తిరిగి ప్రయత్నించండన్న సమాధానం మాత్రమే వస్తోంది. మరికొందరు అధికారుల ఫోన్లకు ఎన్ని కాల్స్ చేసినా, ఐయామ్ ఇన్ మీటింగ్ అనే ఎస్‌ఎంఎస్ పంపుతున్నారు.