కర్నూల్

238 కేంద్రాల్లో పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు:నంద్యాల శాసనసభా స్థానానికి ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూల్ విడుదల చేయడంతో అధికారులు సమాయత్తమవుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లపై రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించి నిర్వహణకు శ్రీకారం చుట్టారు. నంద్యాల శాసనసభా నియోజకవర్గంలో 2,09, 612 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుష ఓటర్లు 1,03,328 మంది, మహిళా ఓటర్లు 1,06,223 మంది, థర్డ్ జెండర్ ఓట్లు 61 ఉన్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో నంద్యాల పురపాలక సంఘంలో 149, గ్రామీణ ప్రాంతాల్లో 89తో కలిపి మొత్తం 238 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ ముగిశాక ఈవిఎంలను భద్రపరిచే ప్రాంతాన్ని, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని రెండు మూడు రోజుల్లో కలెక్టర్ నిర్ణయించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి అనుక్షణం పోలింగ్ జరుగుతున్న తీరును అధికారులు పరిశీలించనున్నారు. ఎక్కడ ఏం జరిగినా తక్షణం ఉన్నతాధికారులు స్పందించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకఇంగా బూత్ స్థాయి అధికారులను నియమించనున్నారు. వీరి నుంచి సమాచారం అందిన వెంట నే ఇటు కలెక్టర్, అటు ఎస్పీలు చర్యలకు ఆదేశాలు జారీ చేయనున్నారు. నంద్యాలలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రతి చిన్న విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ ప్రకటించారు. అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని ఆదేశించారు. ఇక నంద్యాలలో ఎన్నికలు జరుగుతున్నా జిల్లా వ్యాప్తంగా సొంత తుపాకులు ఉన్న వారు శుక్రవారం సాయంత్రంలోగా తమ సమీప పోలీస్‌స్టేషనులో వాటిని అప్పగించాలని కలెక్టర్ సూచించారు. ఇక నియోజకవర్గ ఎన్నికల అధికారిగా నంద్యాల డివిజనల్ రెవెన్యూ అధికారి వ్యవహరించనుండగా నంద్యాల, గోస్పాడు తహశీల్దార్లు సహాయ ఎన్నికల అధికారులుగా పని చేస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నిబంధనలు అమలులోకి వచ్చాయి. పోటీలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు చేసే ఖర్చులు లెక్కలు చూపాల్సిన సమయం ప్రారంభమైంది. అభ్యర్థుల ప్రచారంలో ఎన్నికల కమిషన్ నియమించే వీడియోగ్రాఫర్ విధి నిర్వహణలో ఉంటారు. ఆయన ప్రచార ప్రక్రియను పూర్తిగా చిత్రీకరించనున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి అవసరమైతే కఠిన చర్యలకు ఆదేశాలు జారీ కానున్నాయి. నియోజకవర్గంలో రౌడీ, కేడీ షీటర్లు, పోలీసు రికార్డుల్లో నేరచరిత్ర కలిగిన వారిని తహశీల్దారు వద్ద బైండోవర్ చేయనున్నారు. నంద్యాల నియోజకవర్గంలోనే కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన వారిపై పోలీసు నిఘా కొనసాగనుంది. సామాజిక మాధ్యమాల్లో విషపూరిత, అవాస్తవ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసే వారిపైనా కఠినంగా వ్యవహరించనున్నారు. సోషియల్ మీడియాను దుర్వినియోగం చేస్తే సంబంధిత చట్టాల ఆధారంగా అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.