అనంతపురం

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్: శ్రావణ శుద్ద చవితిని నాగుల చవితిగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం ఉదయం నుండే నగర ప్రజలు తమ కుటుంబంతో కలసి నాగులకట్ట, పుట్టలకు వెళ్లి నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బియ్యం పిండి, నువ్వులు, బెల్లంతో కూడిన ప్రసాదాన్ని నాగదేవతలకు నైవేద్యంగా సమర్పించి, ఆవుపాలను నాగులకు, పుట్టకు పోశారు. నగరంలోని వివిధ ఆలయాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న నాగులకట్టలు, పుట్టలు భక్తులతో కిటకిటలాడాయి. నాగుల చవితి, నాగ పంచమిని భక్తులు నాగారాధన, నాగ పూజలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కాగా నాగుల చవితిని పురస్కరించుకుని కరణం వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నాగుల చవితి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. మూడో రోడ్డులోని జిఆర్.్ఫంక్షన్ హాలు నుండి రైల్వే గేట్, రైల్వే స్టేషన్, శ్రీ కంఠం సర్కిల్, తాడిపత్రి బస్టాండ్, బసవన్నకట్ట, సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్ మీదుగా ఆర్ట్స్ కళాశాల వరకు నాగదేవతల ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో ఆర్కెస్ట్రా, ఉరుముల నృత్యాలు, డప్పులు, గురవయ్యల నృత్యాలు, కోలాటం, చెక్క భజన, కీలుగుర్రాలు, మరగాళ్లు, లంబాడీ మహిళల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర ప్రజలు పెద్ద ఎత్తున నాగదేవతలకు స్వాగతం పలుకుతూ పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలోని మైదానంలో నిత్య సంతోషిణి, సూర్యపవన్, నాగారం లావణ్యలత మొదలగు వారిచే నిర్వహింపబడిన సంగీత విభావరి నగరవాసులను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో వివిధ ఆధ్యాత్మిక సంస్థలు, భజన సంఘాల ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.