అనంతపురం

రైతన్నలు అధైర్యపడవద్దు.. రక్షకతడులిస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి: తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశెనగ పంట సాగు చేసిన ప్రతి ఒక్క రైతు పొలానికి రెయిన్‌గన్ల ద్వారా రక్షక తడులందించి వాటిని కాపాడుతామని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి పరిటాల సునీత, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని పులేటిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి పొలంలో రక్షక తడులందించే రెయిన్‌గన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ అనంతకు 3.43 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ వేరుశెనగను అందివ్వడం జరిగిందన్నారు. అయితే కేవలం 15శాతం మాత్రమే సబ్సిడీ వేరుశెనగ రైతులు విక్రయించడం జరిగిందన్నారు. వీటికి కారణం వర్షాలు సకాలంలో రాకపోవడమేనన్నారు. అదేవిధంగా వివిధ రకాల నవధాన్యపు పంటలను సాగు చేసుకునేందుకు వీలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట సాగు చేసేవారన్నారు. అయితే ప్రస్తుతం కేవలం 3 లక్షల ఎకరాలు మాత్రమే వేరుశెనగ సాగు చేశారన్నారు. కేవలం 20శాతం మాత్రమే వేరుశెనగ విత్తనం వేయడం జరిగిందన్నారు. ఇక మిగిలింది 80శాతం పలు రకాల పంటలను వేసేందుకు వీలుగా శాస్తవ్రేత్తల సూచనలు, సలహాల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం మంత్రి సునీత మాట్లాడుతూ పూత దశలో వున్న వేరుశెనగను రక్షక తడులు అందించి పంటలు కాపాడుతామన్నారు. రైతులు అధైర్యపడవద్దని, నీటి లభ్యత కల్గిన ప్రదేశాల్లో రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు తదితర వాటిని ఉపయోగించుకుని పంటలు కాపాడేందుకు సిద్ధంగా వున్నామన్నారు. మరిన్ని రాయితీ పథకాలను రైతన్నల కోసం ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. రక్షక తడులందించి పంటను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు. వీటితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులకు రైతన్నలు తమ సహాయ సహకారాలు అందించాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడిఎ శ్రీరామమూర్తి, తహశీల్దార్ నాగరాజు, ఎంపిడిఓ రామాంజనేయులు తదితరులు వున్నారు.