సబ్ ఫీచర్

మాతృభాష ఘోష వినపడదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటిష్‌వారి పాలనా కాలంలో మెకాలే రూ పొందించిన విద్యను, వారి భాషయిన ఆం గ్లాన్ని మనపై అప్పటి పాలకులు రుద్ద ప్రయత్నించడం వారి నిరంకుశ పాలనకు నిదర్శనం. సంస్కృతాన్ని ‘మృత భాష’గా వారు ప్రకటించారు. ఆంగ్లాన్ని మాధ్యమంగా చేసి పాఠశాలలు నడిపిద్దామనే వారి పథకం ఎక్కువ కాలం సాగలేదు. ప్రాంతీయ భాషలలోనే దాదాపు అన్ని పాఠశాలల్లో విద్య బోధింపబడేది. మా తరం వారంతా మాతృ భాష మాధ్యమంలో చదువుకున్నవారమే. అప్పట్లో మాతృ భాషోద్యమాలు ఉవ్వెత్తున లేస్తున్నప్పటికీ దేశ స్వాతంత్య్రోద్యమానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
స్వాతంత్య్రానంతరం విద్యాలయాలలో మాతృభాషను ప్రథమ భాషగాను, మాధ్యమంగాను ఉంటుండగా, స్వాతంత్య్రం పొందిన జాతిగా అనుసంధాన భాషగాను, అధికార భాషగాను, రెండవ భాషగా హిందీని నిర్ణయించారు. అప్పటికే మనకు కొన్ని ఉన్నత పాఠశాలల్లోను, ఉన్నత విద్యాలయాలలోను ఆంగ్లభాషను మూడవ భాషగాను త్రిభాషా సూత్రంగా మన విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టారు. బ్రిటిష్‌వారు మనకు అందించిన స్వ తంత్ర భారత్‌లో ‘ప్రాంత పునర్వ్యవస్థీకరణ కమిషన్’ (ఎస్‌ఆర్‌సి) ద్వారా భాషాప్రయుక్త రాష్ట్రాలేర్పడ్డాయి (బొంబాయి, పంజాబ్ మినహా). పాఠశాల స్థాయిలో క్రమంగా మాతృభాష మాధ్యమమైంది. ఒక సమయంలో ఇంటర్మీడియట్ లేక కొనే్నళ్లు నడచిన పియుసిలోను, డిగ్రీ స్థాయిలోను మాతృభాష మాధ్యమంగా అన్ని సబ్జక్టులను బోధించడం జరిగింది. అన్ని విషయాలను మాతృభాషలోనే బోధించడానికి పాఠ్యగ్రంథాలు కూడా ముద్రించబడ్డాయి. దీంతో ఉపాధ్యాయులకు బోధించడం, విద్యార్థులకు అర్థం చేసుకోవడం సులువైంది.
ఇలావుండగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు వచ్చి ఆంగ్ల మాధ్యమంపై లేనిపోని వ్యామోహాన్ని ప్రజల్లో కలిగించాయి. ప్రైవేటు పాఠశాలల ప్రాధాన్యత పెరిగి విద్యలో వ్యాపారీకరణ అనే రోగం వృద్ధి పొందుతూ వచ్చింది. మాతృభాషలో విద్యాబోధనకు చేకూర్చుతున్న ప్రోత్సాహంలో 1980- 90ల మధ్య కాలంలో మరొక చెప్పుకోదగ్గ సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘాన్ని ఏర్పరచి తెలుగు భాషా వికాసానికి కొత్త పుంతలను తొక్కించే అవకాశాలను పరిశీలించే స్వేచ్ఛను ఆ సంఘానికిచ్చింది. దివంగత డా. సి.నారాయణరెడ్డి అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా వున్నపుడు వారు విశ్వవిద్యాలయాలలో పి.జి. కోర్సులు తెలుగు మాధ్యమంలో గరపడానికి గల అవకాశాలను పరిశీలించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చారు. అప్పుడు డా. కె.రామకృష్ణారావు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉప కులపతి. విశ్వవిద్యాలయాలలో వున్న వివిధ ఫాకల్టీల డీన్ (అధ్యక్షులు)లతో సమావేశం జరిపి అందరి అభిప్రాయాల్ని అడిగారు. తలవని తలంపుగా ఉప కులపతి రామకృష్ణారావు పక్కనున్న ఆసనంలో ఫార్మాస్యూటికల్ సైనె్సస్ ఫేకల్టీ డీన్‌గా నేనుండటం తటస్థించింది. అలా అభిప్రాయాలు తెలిపేవారిలో నేను మొదటి వాడినయ్యాను. నా పరిశోధన ప్రాగ్ పట్టణం (చెకోస్లావేకియా రాజధాని)లో జరిగినది. దాదాపు నాలుగు సంవత్సరాలు యూరప్ దేశాలలో వుండడం చేత అక్కడి విద్యా విధానం గూర్చి తెలుసుకునే అవకాశం కలిగింది. కావున ‘యూరప్‌లోని అన్ని దేశాలలో వలె పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి, పరిశోధనల వరకు విద్య మాతృభాషలో వుండడం నేను హర్షిస్తున్నాను. స్వాతంత్య్రానంతరం మన మాతృభాషలను కూడా విద్యకు మాధ్యమాలుగా జేసి, ఇజ్రాయిల్, టర్కీ, రెండవ ప్రపంచ యుద్ధంలో చితికిపోయి లేచి వికసించిన జపాన్ వలే మాతృభాషలను వికసింపజేసి వాటి మాధ్యమంలో అన్ని స్థాయిలలోను విద్యను గరపడం హర్షిస్తాను. కాని ఆ స్థితి రావాలంటే మనము ప్రాథమిక స్థాయి నుండి ఎన్నో మెట్లెక్కాలి. ప్రస్తుత పరిస్థితులలో పి.జి తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగావకాశాలను చూపించగలదా? అందుచేత ప్రాథమిక స్థాయి నుండి మాతృ భాషలో విద్యను పటిష్టం చేసి భాషకు తగిన స్థితిని అన్ని వ్యవస్థలలోను కల్పించి సమయం అనుకూలంగా వున్నపుడు పిజి కోర్సులు (స్నాతకోత్తర విద్యాలయాలలో చదువులు) కూడా మాతృభాషలోనే జరపాలని కాంక్షిస్తున్నా’’ అన్నాను.
తక్కిన ఫాకల్టీ డీన్‌లందరూ నా అభిప్రాయానే్న సమర్ధిస్తూ వచ్చారు. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే పిజి కోర్సులనే మాతృభాషలో నిర్వహిద్దామనే స్థాయికి ఎదుగుతున్న మన విద్యను ప్రస్తుత పాలకులు ఆంగ్లభాషతో, ఆంగ్ల మాధ్యమంగా ప్రయోగాలు చేస్తూ తెలుగు భాషను అధోగతికి తీసుకెళ్లడం తిరోగమన చర్య అనకతప్పదు. తెలుగు సీమను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలుగా విభజించిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు క్రమంగా మున్సిపల్ పాఠశాలల్లో తెలుగులో బోధనను రద్దుచేస్తూ 2017 జనవరిలో జిఓ 14ను తెచ్చి తర్వాత అంగన్‌వాడీ పాఠశాలల్లో కూడా తెలుగును రద్దుచేసే ప్రయత్నాలు చేస్తుండడం- తెలుగు భాషా వికాసానికి తిరోగమన చర్య అవుతుంది. ఈ చర్యలు విద్యా శాఖమంత్రి ద్వారా జరుపబడలేదు. ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు. కార్పొరేట్ విద్యాలయాలను నడిపస్తున్నాడనే పేరున్న ఏపి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామాత్యుల ద్వారా ఈ జీవో రావడం తెలుగు భాషాభిమానులకు అనుమానం కలిగిస్తుంది.
విద్యను అమ్ముకోరాదనే ఈ దేశంలో విద్యను సామాన్యులకు అందుబాటులో లేని ఖరీదైన స్థాయికి తీసుకెడుతున్న పాలకులను- ‘తెలుగువారి అభివృద్ధి కాముకులు’ అనాలా? నిరోధకులు అనాలా? మాతృభాషను ముందుకు తీసుకెళుతున్నారని అనుకోవాలా? నాశనం చేస్తున్నారనుకోవాలా? ఒక పక్క దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్‌కి ‘్భరతరత్న’ పురస్కారం ఇవ్వాలని తమ పార్టీ మహానాడులో అధికార తెదేపా వారు తీర్మానాలు చేస్తూ, మరొకవైపున ఆయన ఆశయాలకు తూట్లు పొడవడంలో అర్థం ఏమిటి? తెలుగుకి, తెలుగువారి పురోగతిని కాంక్షించేవారే మీరైతే ఆంగ్ల మాధ్యమం జి.ఓలను రద్దుచేసి, ఆ చర్యలకు అడ్డుకట్ట వేయాలి. ఒక భాష నశిస్తే ఆ జాతి నశిస్తున్నట్లేనని పాలకులు గుర్తించాలి. ఆంగ్ల భాషాధ్యయనం వద్దనడంలేదు. మాతృభాషను పణంగా పెట్టి పరాయి భాషాధ్యయనం చేయిస్తే అది తెలుగువారి చేటుకే అవుతుంది. అందుకే పాఠశాలల్లో, నర్సరీ, ప్రాథమిక స్థాయిల్లో మాతృభాష తప్పక బోధింపబడాలి. మాతృభాషే మాధ్యమమవాలి.