జాతీయ వార్తలు

గెలవలేని యుద్ధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రస్తుత సాంకేతిక యుగంలో వ్యక్తిగత వివరాల గోప్యతను పరిరక్షించడమన్నది గెలవలేని యుద్ధమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఆందోళన కలిగిస్తున్నాయని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ప్రైవసీ హక్కు ప్రాథమిక హక్కుల పరిథిలోకి వస్తుందా అన్న అంశంపై గత ఆరు రోజులుగా వాదోపవాదాలను విన్న చీఫ్ జస్టీస్ కేహర్ సారథ్యంలోని ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 27లోగా దీనిపై తీర్పును వెలువరించే అవకాశం ఉంది. అదే రోజున చీఫ్ జస్టిస్ కేహర్ పదవీ విరమణ చేస్తారు. వ్యక్తిగత గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించాలా వద్దా అన్న అంశంపై సీనియర్ న్యాయవాదులు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అరవింద్ దాతర్, కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, శ్యామ్ దివన్, సిఎ సుందరం తదితరులు అనుకూల ప్రతికూల వాదనలు వినిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత వివరాల పరిరక్షణకు సమగ్ర రీతిలో మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఉందని ఇప్పటికే స్పష్టం చేసిన ధర్మాసనం ‘ప్రైవసీ విషయంలో గెలవలేని యుద్ధమే చేస్తున్నాం. ఏ అవసరాల కోసం వ్యక్తుల వ్యక్తిగత వివరాలను వినియోగిస్తారో తెలియని పరిస్థితి నేడు నెలకొంది. ఇదే ఆందోళనకరమైన విషయం’అని తెలిపింది. నేటి ఆధునిక యుగంలో పారదర్శకత అన్నది కీలకమని, వ్యక్తిగత వివరాల వెల్లడిని గోప్యత హక్కు గా పరిగణించలేమని గుజరాత్ ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ రాకేశ్ ద్వివేది అన్నారు. ఈ వివరాలను దుర్వినియోగం చేసినా ఇతర ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినా అలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం టెలికాం నియంత్రణ అథారిటీకి ఉంటుందన్నారు.