జాతీయ వార్తలు

నెలాఖరుకు విస్తరణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన అనంతరం నెలాఖరుకు కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేపట్టేందుకు ప్రధాని మోదీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 2019లో జరిగే లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణకు మోదీ యోచిస్తున్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు తమిళనాడులో అధికారంలోవున్న అన్నాడిఎంకెను సైతం కేబినెట్‌లోకి తీసుకోవచ్చని చెబుతున్నారు. తెలంగాణలో అధికారంలోవున్న తెరాసతోనూ భాజపా మంతనాలు సాగిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఆంధ్రకు సంబంధించినంత వరకు తెలుగుదేశంతో కొనసాగుతున్న పొత్తు ఇటీవల కొంత బలహీనపడిందని అంటున్నారు. ఆంధ్రలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించిన కమలనాథులు 2019 లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాతో సీట్ల సర్దుబాటు చేసుకుంటారన్న మాట వినిపిస్తోంది. అలాగే ఆంధ్రలో కాపువర్గాన్ని కలుపుకునిపోయే అవకాశాలూ లేకపోలేదని పార్టీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. దీనికోసం నరేంద్ర మోదీ ఈ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడికి కేబినెట్‌లో స్థానం కల్పించేందుకు పావులు కదపవచ్చనే మాట వినిపిస్తోంది. అయితే తెలుగుదేశంతో బిజెపి పొత్తు కొనసాగినంత కాలం వైకాపాని కేంద్ర కేబినెట్‌లో చేర్చుకోవటం ఎంతమాత్రం సాధ్యం కాదనేది అందరికీ తెలిసిందే. తెలుగుదేశం దూరమైతే తప్ప వైకాపా తదితర పార్టీలతో పొత్తు పెట్టుకోవటం అసాధ్యం. బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య దూరం పెరుగుతోందనేది అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిరాకరించినప్పటి నుంచి చంద్రబాబు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. తెలుగుదేశం పలుకుబడి దిగజారుతున్నందుకే బిజెపి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవటం గురించి ఆలోచిస్తోందన్న మాటా వినిపిస్తోంది. అన్నాడిఎంకెకు చెందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైకు కేబినెట్ మంత్రి హోదా ఇచ్చి, అన్నాడిఎంకెలోని రెండు వర్గాల నుండి ఒక్కొక్కరికి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది. ఇదిలావుంటే తెలుగుదేశం సభ్యులు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. బిజెపి, తెలుగుదేశం పొత్తు యథాతథంగా కొనసాగే పక్షంలో తెదేపాకు చెందిన ఒకరికి సహాయ మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. దీనికోసం లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, సీనియర్ ఎంపీ కొనగళ్ల నారాయణ, రాయలసీమకు చెందిన మరో సీనియర్ ఎంపీ నిమ్మల కిష్టప్ప పోటీ పడుతున్నట్టు సమాచారం. తెలుగదేశం పార్టీకి చెందిన అశోక్‌గజపతి రాజు కేబినెట్ మంత్రిగా పనిచేస్తుంటే, సుజనాచౌదరి సహాయ మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. కేంద్ర కేబినెట్ నుంచి రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ గోవా సిఎంగా వెళ్లారు. పర్యావరణ, అటవీ మంత్రి అనీల్‌మాధవ్ దవే మరణించారు. పట్టణాభివృద్ధి, సమాచార మంత్రి వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతిగా వెళ్తున్నారు. ఇవికాకుండా, సమర్థంగా పనిచేయని కొందరు మంత్రులను తొలగించేందుకు మోదీ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. పిఎంవో ఇప్పటికే కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రుల పనితీరుపై ఒక నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారంగా కేబినెట్ నుంచి ఎవరిని తొలగించాలి, ఎవరికి పదోన్నతి కల్పించాలనేది నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని అంటున్నారు. ఇదిలావుంటే బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాజ్యసభకు వచ్చిన తరువాత కూడా పార్టీ అధ్యక్ష పదవిలోనే కొనసాగుతారు తప్ప కేంద్ర మంత్రివర్గంలో చేరటం లేదు.